logo

మూడు రోజులైంది.. మంచినీళ్లొచ్చి!

వేసవి ఎండలతో సతమతమవుతున్న సమయంలో గుక్కెడు తాగునీరు అందించకపోతే బతికేదెలాగంటూ మారేడుమిల్లి చెలకవీధికి మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 30 May 2023 03:21 IST

కార్యాలయ పరిపాలన అధికారికి వినతిపత్రం అందిస్తున్న మహిళలు

మారేడుమిల్లి, న్యూస్‌టుడే: వేసవి ఎండలతో సతమతమవుతున్న సమయంలో గుక్కెడు తాగునీరు అందించకపోతే బతికేదెలాగంటూ మారేడుమిల్లి చెలకవీధికి మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి సరఫరా పునరుద్ధరించాలంటూ సోమవారం మండల పరిషత్తు కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. చెలకవీధికి మూడు రోజులుగా పంచాయతీ నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో కనీసం వాడుకోవడానికి కూడా నీళ్లు లేకపోవడంతో మహిళలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తరచూ ఇదే పరిస్థితి నెలకొంటుండటంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మహిళలంతా మండల పరిషత్తు కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. నీటి సరఫరా పునరుద్ధరించాలని నినాదాలు చేశారు. కార్యాలయ ఏవో రమణమూర్తికి వినతిపత్రం అందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని