logo

కాలం చెల్లిన పాల సరఫరాపై నోటీసులు

అంగన్‌వాడీ కేంద్రాలకు పాలు సరఫరా చేసే గోదామును సోమవారం ఐసీడీఎస్‌ అధికారులు తనిఖీ చేశారు.

Published : 30 May 2023 03:21 IST

పాల గోదామును పరిశీలిస్తున్న ఐసీడీఎస్‌ పీవో శారద

అరకులోయ, న్యూస్‌టుడే: అంగన్‌వాడీ కేంద్రాలకు పాలు సరఫరా చేసే గోదామును సోమవారం ఐసీడీఎస్‌ అధికారులు తనిఖీ చేశారు. ‘ఈనాడు’లో ‘అంగన్‌వాడీలకు కాలం చెల్లిన పాల సరఫరా’ శీర్షికన సోమవారం ప్రచురితమైన వార్తకు ఐసీడీఎస్‌ పీవో శారద స్పందించారు. ఎండపల్లివలసలోని పాల గోదామును తనిఖీ చేశారు. పాల పాకెట్ల తయారీ తేదీలను పరిశీలించారు. కాలం చెల్లిన పాలను గోదాము నిర్వాహకులకు అప్పగించి వాటి స్థానంలో కొత్త పాల పాకెట్లు అంగన్‌వాడీలకు అందజేశారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ గుత్తేదారుకు నోటీసు జారీ చేశామని, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని