logo

చాపరాయి సుందరీకరణకు చర్యలు

పర్యాటక కేంద్రం చాపరాయి జలవిహారిలో సమూల మార్పులు చేసి మరింత సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు ఐటీడీఏ పీవో అభిషేక్‌ పేర్కొన్నారు.

Published : 01 Jun 2023 02:47 IST

చాపరాయిలో మాట్లాడుతున్న ఐటీడీఏ పీవో అభిషేక్‌

డుంబ్రిగుడ, న్యూస్‌టుడే: పర్యాటక కేంద్రం చాపరాయి జలవిహారిలో సమూల మార్పులు చేసి మరింత సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు ఐటీడీఏ పీవో అభిషేక్‌ పేర్కొన్నారు. చాపరాయి జలవిహారిని బుధవారం ఆయన సందర్శించారు. సౌకర్యాల కల్పనపై ఇంజినీరింగ్‌ అధికారులతో మాట్లాడారు. గార్డెన్‌, మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదుల పునర్నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేయాలని ఇంజినీరింగ్‌ అధికారులను ఆదేశించారు. ఎకో టూరిజం ద్వారా అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నామని తెలిపారు. స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని వైకాపా మండల అధ్యక్షుడు గోపాల్‌ విన్నవించారు. ఇంజినీరింగ్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయండి

అరకులోయ, న్యూస్‌టుడే: పద్మాపురం ఉద్యానంలో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకురావాలని పీవో అభిషేక్‌ ఆదేశించారు. పద్మాపురం ఉద్యానాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. కొత్తగా నిర్మిస్తున్న కాటేజీలు, రెస్టారెంట్‌లను పరిశీలించారు. పగోడాలు, రెస్టారెంట్‌, గిరి బజార్‌ల పనులు వేగవంతం చేయాలన్నారు. మ్యూజియం మేనేజర్‌ మురళి, పద్మాపురం ఉద్యానం మేనేజర్‌ బొంజుబాబు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని