సరిహద్దులు దాటుతున్న ఇసుక
ఎటపాక మండలంలో అనుమతులు లేకుండానే ఇసుక ర్యాంపులు ఏర్పాటుచేసి అక్కడి నుంచి అక్రమ రవాణాకు ఒడిగడుతున్నారు.
అధికారుల నిర్లక్ష్యం
రాజుపేట శివారులో తెలంగాణాకు ట్రాక్టర్లపై ఇసుకను తరలింపు
ఎటపాక, న్యూస్‌టుడే: ఎటపాక మండలంలో అనుమతులు లేకుండానే ఇసుక ర్యాంపులు ఏర్పాటుచేసి అక్కడి నుంచి అక్రమ రవాణాకు ఒడిగడుతున్నారు. గుండాల, కన్నాయిగూడెం, గొమ్ముకోయగూడెం గ్రామాల్లో అనధికారిక ఇసుక ర్యాంపులు నిర్వహిస్తున్నారు. ఇక్కడి నుంచి రాత్రి, పగలు తేడా లేకుండా వందల సంఖ్యలో ట్రాక్టర్లు, లారీల్లో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. అక్రమార్కులు మాత్రం రూ. కోట్లలో గడిస్తున్నారు. ఆంధ్రా సరిహద్దులోని ఎటపాక, గుండాల మీదుగా తెలంగాణ రాష్ట్రానికి ఇసుక అక్రమ రవాణా జోరుగా చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం గమనార్హం. రాజుపేట, మేడువాయి, ఎటపాక, కన్నాయిగూడెం, గుండాల గ్రామాల్లో కట్టడాలకు సైతం ఇదే ఇసుకను ఉపయోగిస్తున్నారు. దీనిపై తహసీల్దార్ వేణుగోపాల్‌ను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా అనధికారిక ఇసుక ర్యాంపుల నిర్వహణపై తమకు సమాచారం లేదన్నారు. ఈ గ్రామాల్లో పర్యటించి ఇసుక అక్రమ రవాణాచేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని తహసీల్దార్ స్పష్టం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Rupert Murdoch: ‘ఫాక్స్’ ఛైర్మన్ బాధ్యతల నుంచి వైదొలిగిన రూపర్ట్ మర్దోక్
-
Stomach Pain: కడుపు నొప్పితో ఆస్పత్రికి.. ‘ఎక్స్-రే’ చూస్తే షాక్!
-
World Cup: ఆ ఇద్దరూ ఉండటం వల్లే సంజూ శాంసన్‌ను ఎంపిక చేయలేదు: హర్భజన్ సింగ్
-
TDP: వైకాపా దౌర్జన్యాలను ఎలా ఎదుర్కొందాం? టీడీఎల్పీలో చర్చ
-
Flipkart: మరోసారి బిగ్ బిలియన్ డేస్ సేల్.. వాటిపై భారీ డిస్కౌంట్!
-
LEO Movie: పోస్టర్లతోనే ‘లియో’ కథను హింట్ ఇచ్చారా? ఆ జాబితాలోనూ నెం.1