బాబు రాకతో కోలాహలం
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నవ వధూవరులు ప్రగడ రాజా, భానులను ఆశీర్వదించడానికి బుధవారం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం వచ్చారు.
కిక్కిరిసిన అచ్యుతాపురం
ఈనాడు డిజిటల్ అనకాపల్లి - న్యూస్‌టుడే, అచ్యుతాపురం, ఎలమంచిలి: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నవ వధూవరులు ప్రగడ రాజా, భానులను ఆశీర్వదించడానికి బుధవారం అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం వచ్చారు. ఆయనకు నియోజకవర్గ సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా పార్టీ నాయకులు స్వాగతం పలికారు. పువ్వులు చల్లుతూ దారిపొడవునా పుష్పగుచ్ఛాలు అందించారు. దంపతులిద్దరూ బాబు పాదాలకు నమస్కరించారు. పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభను తలపించేలా కార్యకర్తలు, అభిమానులు వేల సంఖ్యలో తరలివచ్చారు.
అధినేత పర్యటన.. అభిమానుల సందడి
విశాఖ నగరంలోని పోర్టు స్టేడియంకు తరలివచ్చిన అభిమానులకు అభివాదం చేస్తున్న తెదేపా అధినేత చంద్రబాబునాయుడు
తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అచ్యుతాపురం వెళ్తూ పరవాడ సినిమాహాల్ కూడలిలో కాసేపు ఆగారు. మాజీ మంత్రి, తెదేపా సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. చంద్రబాబు ప్రజలకు అభివాదం చేశారు.
అచ్యుతాపురంలో వధువరులతో చంద్రబాబు నాయుడు, కల్యాణ మండపానికి తరలివచ్చిన అభిమానులు
పరవాడ, న్యూస్‌టుడే
దారి పొడవునా ఘన స్వాగతం
వెదురువాడ సర్పంచ్ కొయ్యిశ్రీనివాసరావు దంపతులతో చంద్రబాబు
ఈనాడు డిజిటల్ అనకాపల్లి - న్యూస్‌టుడే, అచ్యుతాపురం, ఎలమంచిలి: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం, విశాఖ నగరంలోని తెదేపా నేతల ఇళ్లలో వివాహ కార్యక్రమాలకు బుధవారం తెదేపా అధినేత చంద్రబాబునాయుడు హాజరయ్యారు. సెజ్ రోడ్డు అంతా అభిమానులతో నిండిపోయింది. సాయంత్రం 4 గంటలకే ఫంక్షన్ హాలు అంతా నిండిపోయింది. వేలాది మంది అభిమానులు బయటే ఉండిపోయారు. చంద్రబాబును చూడటానికి ఎలమంచిలి నియోజవర్గంలోని నాలుగు మండలాలతో పాటు అనకాపల్లి, పెందుర్తి, పాయకరావుపేట నియోజకవర్గాల నుంచి భారీగా అభిమానులు తరలివచ్చారు. సీఎం చంద్రబాబు అంటూ అభిమానులు చంద్రబాబు వేదికపై ఉన్నంత సేపు నినాదాలు చేశారు. మాజీ ముఖ్యమంత్రికి ఏర్పాటు చేయాల్సినంత రక్షణ ఏర్పాట్లు చేయడంలో పోలీసులు విఫలమయ్యారు. పలు చోట్ల పూర్తి స్థాయిలో పోలీసులు లేరు. చంద్రబాబు వేదిక నుంచి దిగడానికి ఇబ్బంది పడ్డారు. నియోజకవర్గంలోని సమస్యలను ప్రగడ చంద్రబాబుకు వివరించారు. ముఖ్య నాయకులను బాబుకు పరిచయం చేశారు. వివిధ సమస్యలపై పలువురు చంద్రబాబుకు వినతులు అందించారు. అవన్నీ పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. తెదేపా నాయకులు మాజీ ఎమ్మెల్సీలు పప్పల చలపతిరావు, బుద్ధ నాగజగదీశ్వరరావు, నాయకులు రాజాన రమేష్‌కుమార్, లాలం భవానీ, మేరుగు బాపునాయుడు, ఆడారి మంజు, డ్రీమ్స్ నాయుడు, డొక్కా నాగభూషణం, దిన్‌బాబు, దూళి రంగనాయకులు, గొర్లె నానాజీ, కూనిశెట్టి రమణ, కొండబాబు, తులసీరాం, కొఠారు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. విశాఖ నగరంలోని పోర్టు స్టేడియంలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు కుమారుడు వివాహానికి చంద్రబాబు హాజరయ్యారు. భారీ ఎత్తున తరలివచ్చిన అభిమానులకు బాబు అభివాదం తెలుపుతూ ముందుకు సాగారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
MK Stalin: ప్రజల పట్ల మర్యాదతో ప్రవర్తించండి.. ఉద్యోగులకు సీఎం స్టాలిన్ విజ్ఞప్తి
-
Asteroid : బెన్ను నమూనాల గుట్టు విప్పుతున్నారు.. అక్టోబరు 11న లైవ్ స్ట్రీమింగ్!
-
Tamannaah: అలాంటి సీన్స్‌లో నటించడం మానేశా: దక్షిణాది చిత్రాలపై తమన్నా వ్యాఖ్యలు
-
stuntman sri badri: ‘భోళా శంకర్’ మూవీ పారితోషికాన్ని విరాళంగా ఇచ్చిన స్టంట్‌మ్యాన్ శ్రీబద్రి
-
Hyderabad: చింతల్‌బస్తీ నాలాలో మొసలి పిల్ల.. భయాందోళనలో స్థానికులు
-
Guntur: తెదేపా మహిళా నేత అరెస్టు.. పోలీసుల తీరును తప్పుబట్టిన న్యాయమూర్తి