logo

‘ఉపాధి’ కూలీలకు ఆలస్యంగా చెల్లింపులు

ఉపాధి హామీ కూలీలకు సకాలంలో నిధులు బ్యాంకు ఖాతాలకు జమ కావడం లేదని జడ్పీటీసీలు ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 01 Jun 2023 02:47 IST

స్థాయీ కమిటీ సమావేశాల్లో  సభ్యుల నిలదీత

స్థాయీ కమిటీ సమావేశాల్లో మాట్లాడుతున్న జడ్పీ
ఛైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర, సీఈఓ శ్రీరామమూర్తి

విశాఖపట్నం, న్యూస్‌టుడే: ఉపాధి హామీ కూలీలకు సకాలంలో నిధులు బ్యాంకు ఖాతాలకు జమ కావడం లేదని జడ్పీటీసీలు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం జడ్పీ సమావేశ మందిరంలో జడ్పీ ఛైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు జరిగాయి. అనంతగిరి, ఎస్‌.రాయవరం జడ్పీటీసీలు మాట్లాడుతూ ఉపాధి కూలీలకు సకాలంలో డబ్బులు విడుదల కావడం లేదని, పనిముట్లు, తాగునీటి సదుపాయం కల్పించడం లేదన్నారు. ఆయా అంశాలపై అధికారులు స్పందిస్తూ 15రోజులకు ఒక సారి నిధులు బ్యాంకు ఖాతాలకు జమ చేస్తున్నామని, పని ప్రదేశంలో టెంట్లు వేస్తున్నామని, తాగునీటి వసతి కల్పిస్తామని చెప్పారు. గత నెల 23వ తేదీ వరకు చెల్లింపులు పూర్తి చేశామన్నారు.

* ఛైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్ర మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు గల గ్రామాలకు ఉపాధి హామీ పథకం కింద రోడ్లు నిర్మించాలన్నారు. ఆయా పనులకు డ్వామా అధికారులు వెంటనే ఆమోదం తెలపాలన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాకు 13,005 ఇళ్లు మంజూరయ్యాయని, ఒక్కో లబ్ధిదారునికి రూ.2.30 లక్షలు మంజూరైనట్లు తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎంను సంప్రదించాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో రక్తం కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు. కేజీహెచ్‌ ఇన్‌ఛార్జి పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్‌ రాధాకృష్ణ మాట్లాడుతూ వేసవి తీవ్రత కారణంగా రక్త నిల్వలు తగ్గాయని, అత్యవసర కేసులకు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు.

హాజరైన జడ్పీటీసీ సభ్యులు, అధికారులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని