logo

‘భాజపా, వైకాపాలను గద్దె దించాలి’

మన్యం ప్రాంతంలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి శ్రేణులు కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వంతల సుబ్బారావు పిలుపునిచ్చారు.

Published : 01 Jun 2023 02:47 IST

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కో కన్వీనర్‌గా బాధ్యతలు
చేపట్టిన గోపినాథ్‌ను సన్మానిస్తున్న నాయకులు

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: మన్యం ప్రాంతంలో కాంగ్రెస్‌ పార్టీ బలోపేతానికి శ్రేణులు కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వంతల సుబ్బారావు పిలుపునిచ్చారు. బుధవారం పార్టీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ నిత్యం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తోందన్నారు. కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వాలు ప్రజలకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో ఈ రెండు పార్టీలను గద్దె దింపాలన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ఆదివాసీ విభాగం రాష్ట్ర కో కన్వీనర్‌గా బాధ్యతలు స్వీకరించిన వంతల గోపినాథ్‌ను సన్మానించారు. మాజీ సర్పంచులు కృష్ణపడాల్‌, కాంతమ్మ, నాయకులు బాలరాజు, బొజ్జన్న, రమణ, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. 

‘ఆదివాసీ చట్టాల నిర్వీర్యానికి కుట్ర’

డుంబ్రిగుడ: బోయ వాల్మీకులు, బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చేందుకు అసెంబ్లీలో చేసిన తీర్మానాన్ని రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు కించుమండ వారపు సంతలో బుధవారం సంతకాల సేకరణ చేపట్టారు. పీసీసీ నాయకుడు చిన్నస్వామి మాట్లాడుతూ ఆదివాసీ హక్కులు, చట్టాలను కాలరాసేందుకు  ప్రభుత్వాలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. గిరిజనుల సమస్యలను పక్కనపెట్టిన ఆయా ప్రభుత్వాలకు గుణపాఠం తప్పదన్నారు. యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మదనరావు, ఉపాధ్యక్షుడు గంగాధర్‌, భాగ్యరాజు, రామలింగం, రాజు తదితరులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని