భారీగా గంజాయి పట్టివేత
జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో 315 కేజీల గంజాయిని పోలీసులు బుధవారం పట్టుకున్నారు.
గంజాయి, నిందితులతో ముంచంగిపుట్టు పోలీసులు
పెదబయలు, న్యూస్‌టుడే: జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో 315 కేజీల గంజాయిని పోలీసులు బుధవారం పట్టుకున్నారు. ముంచంగిపుట్టు ఎస్సై రవీంద్ర తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిశా రాష్ట్రం మల్కాన్‌గిరి నుంచి కోరాపుట్టు మీదుగా ముంచంగిపుట్టు వైపు వస్తున్న బొలేరో వాహనాన్ని లబ్బూరు కూడలి వద్ద ఆపి పరిశీలించారు. సుమారు రూ.6.20 లక్షల విలువైన 310 కేజీల గంజాయి దొరికింది. దాన్ని తరలిస్తున్న కోరాపుట్టు జిల్లా నందాపురం బ్లాక్ బిలాపుట్టు పంచాయతీ గోటిపుట్టుకు చెందిన అజయ్‌తంగి, జలపుట్ పంచాయతీ జలపుట్ గ్రామానికి చెందిన రమేష్‌కుమార్, లమతాపుట్టు బ్లాక్ గొడిహంజర్ పంచాయతీ అమలాపుట్టుకు చెందిన సుభాష్ సీసాలను అరెస్టు చేశారు. నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు చెప్పారు.
నిందితులతో అరకులోయ ఎస్‌ఐ సంతోష్
అరకులోయ, న్యూస్‌టుడే: అరకు రైల్వేస్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తుల బ్యాగులను బుధవారం తనిఖీ చేయగా 5 కేజీల గంజాయి దొరికింది. ఎస్‌ఐ సంతోష్ కథనం ప్రకారం.. గంజాయి కలిగి ఉన్న చిత్తూరు జిల్లాకు చెందిన శ్యాం, గూడెంకొత్తవీధి మండలానికి చెందిన గెమ్మెలి రమేష్, డుంబ్రిగుడ మండలానికి చెందిన కొర్రా లక్ష్మణ్‌ను అరెస్టు చేశారు. వీరిలో శ్యాం మన్యం నుంచి గంజాయిని కొనుగోలు చేసి వేరే ప్రాంతానికి తీసుకువెళ్లి విక్రయిస్తుంటాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Guntur Kaaram: రాజమౌళి చిత్రాల స్థాయిలో ‘గుంటూరు కారం’.. ఆ మాటకు కట్టుబడి ఉన్నా: నిర్మాత నాగవంశీ
-
Babar Azam: టాప్-4 చిన్న విషయం.. ప్రపంచకప్ గెలవడమే మా లక్ష్యం : బాబర్ అజామ్
-
JP Nadda : జేపీ నడ్డా పూజలు చేస్తున్న గణేశ్ మండపంలో అగ్నిప్రమాదం
-
Priyamani: ప్రియమణి విషయంలో మరో రూమర్.. స్టార్ హీరోకి తల్లిగా!
-
Sharad Pawar: ‘ఇండియా’లోకి అన్నాడీఎంకేను తీసుకొస్తారా..? శరద్‌పవార్ ఏమన్నారంటే..