logo

తెదేపా కార్యకర్తలకు ఆర్థికసాయం

ఆపదలో ఉన్న తెదేపా కార్యకర్తలు, నాయకులకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, వారికి అవసరమైన సహకారం అందిస్తుందని  మండల తెదేపా అధ్యక్షుడు గురుకు శేషుకుమార్‌ అన్నారు.

Published : 01 Jun 2023 02:47 IST

అనారోగ్యానికి గురైన గిరిజనులకు ఆర్థిక సాయం అందిస్తున్న తెదేపా నాయకులు

మారేడుమిల్లి, న్యూస్‌టుడే: ఆపదలో ఉన్న తెదేపా కార్యకర్తలు, నాయకులకు పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని, వారికి అవసరమైన సహకారం అందిస్తుందని  మండల తెదేపా అధ్యక్షుడు గురుకు శేషుకుమార్‌ అన్నారు. మారేడుమిల్లికి చెందిన తెదేపా కార్యకర్త కారం మంగన్నదొర, వేటుకూరు పంచాయతీ పరిధి పందిరిమామిడికోట గ్రామానికి చెందిన కత్తుల సోమసుందర్‌రెడ్డి ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి వైద్య  ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున పంపించారు. మండల తెదేపా నాయకులు ఆయా కుటుంబ సభ్యులకు బుధవారం ఈ మొత్తం అందించారు. జీఎంవలస ఎంపీటీసీ సభ్యుడు కొరగాని సువర్ణరాజు, మండల తెదేపా నాయకులు పొడియం శీనుబాబు, అందాల సూర్యనారాయణరెడ్డి, శివ తదితరులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు