1.69 లక్షల మందికి రూ.126 కోట్ల లబ్ధి
రైతు భరోసా- పీఎం కిసాన్ పథకం ద్వారా జిల్లాలోని 1.69 లక్షల మంది రైతులకు రూ.126.94 కోట్ల లబ్ధి చేకూరిందని కలెక్టర్ సుమిత్‌కుమార్ తెలిపారు.
‘రైతు భరోసా- పీఎం కిసాన్’ సాయం అందజేత
గురువారం పాడేరు కాఫీ హౌస్‌లో రైతులకు నమూనా చెక్కు అందజేస్తున్న కలెక్టర్ సుమిత్‌కుమార్, ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, ఫాల్గుణ తదితరులు
పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: రైతు భరోసా- పీఎం కిసాన్ పథకం ద్వారా జిల్లాలోని 1.69 లక్షల మంది రైతులకు రూ.126.94 కోట్ల లబ్ధి చేకూరిందని కలెక్టర్ సుమిత్‌కుమార్ తెలిపారు. పత్తికొండ నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగం ప్రత్యక్ష ప్రసారాన్ని గురువారం స్థానిక కాఫీ హౌస్‌లో ఎమ్మెల్యేలు భాగ్యలక్ష్మి, ఫాల్గుణ, అధికారులు, రైతులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్‌లో 4,500 క్వింటాళ్ల విత్తనాలు పంపిణీకి సిద్ధం చేశామని పేర్కొన్నారు. 15 వేల ఎకరాల్లో కాఫీ తోటలు విస్తరిస్తున్నామని చెప్పారు. 10 వేల ఎకరాల్లో ఉద్యాన తోటల పెంపకానికి చర్యలు చేపడుతున్నామన్నారు. ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ వ్యవసాయ రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పర్యటించినప్పుడు పి.ఎం.కిసాన్ సాయం అందడం లేదని పలువురు ఫిర్యాదు చేస్తున్నారన్నారు. రైతులు ఈ-కేవైసీ చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే ఫాల్గుణ మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం రైతులను రాజులను చేస్తోందన్నారు. గిరిజన రైతులకు సకాలంలో విత్తనాలు పంపిణీ చేయాలని కోరారు. అనంతరం రైతులకు నమూనా చెక్కు పంపిణీ చేశారు. జిల్లా వ్యవసాయాధికారి ఎస్.బి.ఎస్.నంద్, పాడేరు ఎంపీపీ రత్నకుమారి, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ సూరిబాబు, జిల్లా వ్యవసాయ సలహా మండలి సభ్యురాలు సరస్వతి, పలువురు జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, రైతులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ఇంటికో కట్టె తెచ్చి.. శ్మశానానికి హద్దుపెట్టి!
-
Damini bhatla: ఊహించని ట్విస్ట్.. బిగ్‌బాస్ నుంచి సింగర్ దామిని ఎలిమినేట్
-
Cyber Crimes: టాస్క్ పేరుతో సైబర్ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలన్న కేంద్ర హోంశాఖ
-
Sudhamurthy: నా పేరును దుర్వినియోగం చేస్తున్నారు.. పోలీసులకు సుధామూర్తి ఫిర్యాదు
-
Social Look: విజయ్ దేవరకొండ ఐస్ బాత్.. మీనాక్షి స్టన్నింగ్ లుక్.. ఐశ్వర్య బ్రైడల్ పోజ్
-
Raghava Lawrence: ఆయన లేకపోతే ఈ వేదికపై ఉండేవాణ్ని కాదు: లారెన్స్