సహకారం.. సరికొత్తగా..
సహకార శాఖను సమూలంగా ప్రక్షాళన చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దేశవ్యాప్తంగా సహకార సంఘాల పనితీరు ఒకేలా ఉండాలనే ఉద్దేశంతో కొత్త సంస్కరణలను అమలులోకి తెస్తోంది.
సంఘాలకు కంప్యూటర్లు.. సిబ్బందికి బదిలీలు
ఈనాడు డిజిటల్, పాడేరు, అనకాపల్లి
దేవరాపల్లి సహకార సంఘంలో సిబ్బంది
సహకార శాఖను సమూలంగా ప్రక్షాళన చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. దేశవ్యాప్తంగా సహకార సంఘాల పనితీరు ఒకేలా ఉండాలనే ఉద్దేశంతో కొత్త సంస్కరణలను అమలులోకి తెస్తోంది. అందులో భాగంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలన్నింటినీ (పీఏసీఎస్) డిజిటలైజేషన్ చేయడం, ఉద్యోగులకు జీతాలు పెంచి బదిలీలు చేయడం.. సంఘాల లావాదేవీలపై అదనపు ఆడిట్‌లు చేపట్టడానికి చర్యలు తీసుకుంటున్నారు.
ఈనెలాఖరు లోగా అన్నీ పూర్తిచేయాలనే లక్ష్యం పెట్టుకున్నారు. అయితే తమ సమస్యలను పరిష్కరించాకే బదిలీల ఆలోచన చేయాలని సహకార ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో 98 ప్రాథమిక సహకార సంఘాలున్నాయి. వీటిలో సుమారు 300 మంది వరకు పనిచేస్తున్నారు. వీరంతా అరకొర జీతాలతో ఏళ్లతరబడి ఒకేచోట విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది వీరికి హెచ్‌ఆర్ పాలసీ అమలుచేసి జీతాలు పెంచడంతో పాటు తొలిసారి బదిలీలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం జీవో నంబర్ 36ను తీసుకొచ్చింది. ఉద్యోగుల జీతభత్యాలు, బదిలీల వ్యవహారంపై జిల్లాస్థాయిలో ఎంపర్‌మెంట్ కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. డీసీసీబీ ఛైర్మన్‌తో పాటు సీఈవో, డీసీవో, త్రీమెన్ కమిటీగా ఉద్యోగ సంఘాలతో సమావేశమై చర్చించి ఏకాభిప్రాయంతో ముందుకెళ్లాలి. జిల్లాలో ఇప్పటివరకు ఆ దిశగా కమిటీ చర్యలు తీసుకోలేదని సహకార ఉద్యోగులు చెబుతున్నారు. పాత జీవో నం.151 ప్రకారం 2014 నుంచి కొత్త జీతాలు అమలయ్యేలా చూడాలని డిమాండ్ చేస్తున్నారు. జీతభత్యాలు, పదవీ విరమణ ప్రయోజనాల చెల్లింపులకు స్పష్టమైన హామీలు వచ్చిన తర్వాతే బదిలీలు చేపట్టాలని కోరుతున్నారు.
పైరవీలు మొదలు..: సహకార సంఘాల సిబ్బందిని ఈ నెలాఖరులోగా బదిలీ చేయాలని నిర్ణయించడంతో అప్పుడే కొంతమంది పైరవీలు మొదలుపెట్టారు. ‘ఫలానా సంఘంలో సీఈవోని కదపొద్దు.. బదిలీ తప్పదంటే దగ్గరలో ఉన్న సంఘానికే వేయండి. లేకుంటే సమస్యలొస్తాయి. ఎవరిని కదిపినా ముందు మాకు సమాచారం ఇవ్వండి. లేకుంటే మీకు మంచిది కాదు’ అంటూ ఒకరిద్దరు ఎమ్మెల్యేలు సంబంధిత అధికారులకు నేరుగా ఫోన్‌చేసి చెప్పడం గమనార్హం. పీఏసీఎస్‌లో సీఈవోతో పాటు మరో ఇద్దరు సిబ్బంది పనిచేస్తుంటారు. ఏళ్లకు ఏళ్లు ఒకేచోట పాతుకుపోయి పనిచేయడంతో వీరు స్థానిక నాయకులతో సత్సంబంధాలు నెరపడం, వారికి కావాల్సిన వారికే రుణాల్విడం, రికవరీల్లో చేతివాటం వంటి ఆరోపణలు వీరిపై ఎక్కువగా ఉన్నాయి. అందువల్లే వేరే సంఘానికి బదిలీపై వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.
దస్త్రాల డిజిటలైజేషన్
ప్రాథమిక సహకార సంఘాలు ఇప్పటివరకు మాన్యువల్‌గానే దస్త్రాలను నిర్వహిస్తున్నారు. రైతులు రుణాలు మంజురు నుంచి రికవరీలు వరకు అన్నీ సర్దుబాట్లుతోనే సరిపెట్టేస్తున్నారు. ఈ క్రమంలో కొంతమంది సిబ్బంది అక్రమాలకు పాల్పడడం జరుగుతోంది. ఈ తరహా అక్రమాలను అడ్డుకట్ట వేసేందుకు ఇకపై సహకార సంఘాల లావాదేవీలన్నీ డిజిటలైజేషన్ చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఒక్కో పీఏసీఎస్‌కు కంప్యూటర్, ప్రింటర్, డాంగిల్ వంటి ఎనిమిది రకాల పరికరాలను అందిస్తున్నారు. కలెక్టర్ ఛైర్మన్‌గా, సీఈవో కన్వీనర్, డీసీవో, నాబార్డు డీడీఎం, ఆప్కాబ్, సంఘాల నుంచి ముగ్గురిని సభ్యులుగా జిల్లాస్థాయి పర్యవేక్షణ అమలు కమిటీగా నియమించి పరికరాలను సహకార సంఘాలకు ఇవ్వనున్నారు. రైతు పీఏసీఎస్‌కు వచ్చి రుణ వాయిదా చెల్లిస్తే నేరుగా రాష్ట్రస్థాయిలో అధికారులు కూడా తెలుసుకునేలా దస్త్రాలన్నింటినీ కంప్యూటరీకరణ చేయబోతున్నారు. ఇవన్నీ జూన్ 30లోగా పూర్తిచేయాలని ప్రభుత్వం ఆదేశించినట్లు డీసీసీబీ సీఈవో డీవీఎస్ వర్మ తెలిపారు.
98 పీఏసీఎస్‌ల్లో 36 సంఘాలు మాత్రమే లాభాల్లో ఉన్నాయి. ఈ లాభాల్లో నడిచే సంఘాల సిబ్బందిని నష్టాల్లో ఉన్న పీఏసీఎస్‌లకు బదిలీ చేస్తే వారి జీతభత్యాలు, ఇతర ప్రయోజనాలకు గ్యారంటీ ఉండదనే ఆందోళన వ్యక్తమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Kishan Reddy: ఉద్యోగాలు భర్తీ చేయకుండా కేసీఆర్ కుట్ర: కిషన్‌రెడ్డి
-
iPhone 15: ఐఫోన్ 15 కొనబోతున్న ఎలాన్ మస్క్.. ఏం నచ్చిందో చెప్పిన బిలియనీర్!
-
China: చైనాలో జనాభా సంఖ్య కంటే ఖాళీ ఇళ్లే ఎక్కువ..!
-
Visakhapatnam: విరిగిపడిన కొండచరియలు.. కేకే లైన్లో ఏడు రైళ్ల నిలిపివేత
-
Pinarayi Vijayan: ‘అందుకే.. సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్నారు’
-
Mann ki Baat: ప్రపంచ వాణిజ్యానికి అది ఆధారంగా నిలుస్తుంది: ప్రధాని మోదీ