logo

రెవెన్యూలో కొలిక్కి రాని బదిలీల కసరత్తు

రెవెన్యూ శాఖలో బదిలీల కసరత్తు కొలిక్కి రాలేదు. కొన్ని కార్యాలయాల్లో మాత్రం బదిలీలు ముగిశాయి. ఈ సారి పరిమిత సంఖ్యలో బదిలీలు జరిగాయి.

Published : 02 Jun 2023 02:42 IST

విశాఖపట్నం, న్యూస్‌టుడే: రెవెన్యూ శాఖలో బదిలీల కసరత్తు కొలిక్కి రాలేదు. కొన్ని కార్యాలయాల్లో మాత్రం బదిలీలు ముగిశాయి. ఈ సారి పరిమిత సంఖ్యలో బదిలీలు జరిగాయి. గడువు తేదీ పొడిగించే అవకాశం ఉందని భావించిన కొన్ని శాఖల అధికారులు చివరి నిమిషం వరకు వేచి చూశారు. గురువారం సాయంత్రం వరకు దీనిపై ఉత్తర్వులు రాకపోవడంతో బదిలీలపై కసరత్తు ముమ్మరం చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాను యూనిట్‌గా తీసుకొని బదిలీల ప్రక్రియ చేపట్టారు. గత ఏడాది పెద్ద ఎత్తున రెవెన్యూలో జరిగాయి. ఈసారి ఆ స్థాయిలో లేకున్నా జూనియర్‌, సీనియర్‌, డీటీ, తహసీల్దార్‌ కేడర్లతో పాటు వీఆర్వో కేటగిరీలో బదిలీలు జరగనున్నాయి. గురువారం రాత్రి వరకు దీనిపై కసరత్తు కొలిక్కి రాలేదు. జలవనరుల శాఖలో నలుగురు ఉద్యోగులకు బదిలీ అయింది. ఏడాది క్రితమే బదిలీపై వచ్చిన ఒక జూనియర్‌ సహాయకుని బదిలీ చేసి, 13 ఏళ్లుగా ఒకే చోట కొనసాగుతున్న సీనియర్‌ సహాయకుని బదిలీ చేయకపోవడం పట్ల ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడ జరిగిన బదిలీల్లో అవకతవకలు జరిగాయని చెబుతున్నారు. జిల్లా ఖజానా శాఖలో ఆరుగురికి బదిలీ అయింది. వీరంతా అనకాపల్లి, ఎలమంచిలి, పాడేరు తదితర ప్రాంతాల్లోని సబ్‌ట్రెజరీలకు వెళ్లారు. ఎస్టీఓ, ఏటీఓల కేటగిరీలో ఇంకా బదిలీ ఉత్తర్వులు వెలువడ లేదు. దేవాదాయశాఖలో... కనకమహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో పనిచేస్తున్న ఇద్దరు జూనియర్‌ సహాయకులకు సింహాచలం దేవస్థానానికి బదిలీ కాగా... అయ్యప్పనగర్‌లో ఉన్న భూ సమేత వెంకటేశ్వరస్వామి ఆలయ ఈఓగా మునగపాక భీమేశ్వరాలయ ఈఓ పీఎస్‌ఎన్‌ మూర్తిని నియమించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని