logo

గిరి రైతుల ఆర్థిక అభ్యున్నతికి కృషి

గిరిజన రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ యంత్రసేవ పథకాన్ని ప్రవేశపెట్టిందని రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి పేర్కొన్నారు.

Published : 03 Jun 2023 02:39 IST

ట్రాక్టర్ల పంపిణీని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే ధనలక్ష్మి

రంపచోడవరం, న్యూస్‌టుడే: గిరిజన రైతులు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ యంత్రసేవ పథకాన్ని ప్రవేశపెట్టిందని రంపచోడవరం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో వైఎస్‌ఆర్‌ యంత్రసేవ పథకం ద్వారా మంజూరైన ట్రాక్టర్లను, యంత్ర పరికరాలను ఎమ్మెల్యే రైతులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె ధనలక్ష్మి మాట్లాడుతూ రూ. 1.27 కోట్ల వ్యయంతో రంపచోడవరం మండలంలో ఒకటి, దేవిపట్నం మండలంలో రెండు, ఎటపాక మండలంలో మూడు, కూనవరంలో ఒకటి, వరరామచంద్రాపురంలో, చింతూరులో మూడు చొప్పున ట్రాక్టర్లు మంజూరు అయ్యాయన్నారు. రూ. 7.5 లక్షల విలువైన ట్రాక్టర్‌ను 40శాతం రాయితీపై రైతులకు అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీపీలు బందం శ్రీదేవి, కుంజం మురళి, జడ్పీటీసీ సభ్యులు పండా వెంకటలక్ష్మి, కృష్ణవేణి, ఉప ఎంపీపీలు కె.బాలకృష్ణ, పండా కుమారి, సర్పంచులు మంగా బొజ్జయ్య, కోసు రమేష్‌దొర, వడగల ప్రసాద్‌, ఎంపీటీసీ సభ్యులు ఉలవల లక్ష్మి, కుంజం వంశీ, తుర్రం వెంకటేశ్వర్లు, వ్యవసాయ శాఖ ఏడీ కె.వి.చౌదరి, వ్యవసాయాధికారి లక్ష్మణ్‌, ఉద్యాన అధికారి రమేష్‌, వ్యవసాయ సలహామండలి డైరెక్టర్‌ డొక్కులూరి రత్నరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని