logo

మా దాహం కేకలు వినిపిస్తున్నాయా..!

ఎండ ఠారెత్తిస్తుండటంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. కాలువలు, బావులు, బోర్లు, గెడ్డలు, ఊటల్లో నీరు ఎండిపోయి తాగునీటికి ప్రజలు అల్లాడుతున్నారు.

Published : 03 Jun 2023 02:39 IST

ఖాళీ బిందెలతో మహిళల ఆందోళన

హుకుంపేట, న్యూస్‌టుడే: ఎండ ఠారెత్తిస్తుండటంతో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. కాలువలు, బావులు, బోర్లు, గెడ్డలు, ఊటల్లో నీరు ఎండిపోయి తాగునీటికి ప్రజలు అల్లాడుతున్నారు. కొన్ని గ్రామాల్లో మహిళలు కిలోమీటర్ల దూరం వెళ్లి నీరు తెచ్చుకుంటున్నారు. హుకుంపేట మండలంలోని కొంతలి పంచాయతీ ముంచంగిపుట్టులో ఉన్న సోలార్‌ నీటి పథకం పాడైంది. నీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖాళీ బిందెలతో శుక్రవారం మహిళలు ఆందోళన చేపట్టారు. గ్రామంలో జల్‌జీవన్‌ పథకం ద్వారా బోర్లు ఏర్పాటు చేసి, వాటికి పంపులు బిగించలేదన్నారు. సంబంధిత అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని