logo

శ్రమదానంతో బావి మరమ్మతు

గ్రామంలో కుళాయిలకు మరమ్మతులు చేపట్టకపోవడంతో గ్రామస్థులు శ్రమదానం చేసి బావిని బాగు చేసుకుని తాగునీటి సమస్యను పరిష్కరించుకున్నారు.

Published : 03 Jun 2023 02:39 IST

బావిలో బురదనీటిని తోడుతున్న మహిళలు

అరకులోయ పట్టణం, న్యూస్‌టుడే: గ్రామంలో కుళాయిలకు మరమ్మతులు చేపట్టకపోవడంతో గ్రామస్థులు శ్రమదానం చేసి బావిని బాగు చేసుకుని తాగునీటి సమస్యను పరిష్కరించుకున్నారు. మాడగడ పంచాయతీ పకనకుడి గ్రామంలో కొన్ని వారాలుగా కుళాయిలు మరమ్మతులకు గురవడంతో తాగునీటి సమస్య నెలకొంది. మరమ్మతులు చేపట్టాలని సర్పంచి దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కరించకపోవడంతో గ్రామంలో పాత బావిని బాగుచేసుకునేందుకు గ్రామస్థులు నిర్ణయించుకున్నారు. బావిలో పేరుకుపోయిన బురదనీటిని శుక్రవారం మహిళలంతా కలసి బయటకు తోడి నీటిని వినియోగించుకునేలా మార్చారు. ఎస్‌ మంజుల, మాజీ సర్పంచి పార్వతి, సావిత్రి, సరోజిని, ధర్మరాయ్‌, రాంపొత్తి, చంద్ర, లక్ష్మి, కంసుల, గురుమూర్తి, ధనేశ్వరరావు, సుజాత, చంప, గంగన్న తదితరులు పాల్గొన్నారు.


మూడు రాజధానులతో సమగ్ర అభివృద్ధి

నినాదాలు చేస్తున్న హనుమంతు లజపతిరాయ్‌, వినియోగదారుల సంఘాల నాయకులు

అరకులోయ పట్టణం, న్యూస్‌టుడే: విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధాని చేయాలని రాష్ట్ర పరిపాలనా వికేంద్రీకరణ జేఏసీ, వినియోగదారుల సంఘం, వైకాపా నాయకుల ఆధ్వర్యంలో అరకులోయలో శుక్రవారం ర్యాలీ చేపట్టారు. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్‌ మూడు రాజధానుల నిర్ణయాన్ని తీసుకున్నారని జేఏసీ ఛైర్మన్‌ ప్రొఫెసర్‌ హనుమంతు లజపతిరాయ్‌ అన్నారు. ఈ నిర్ణయాన్ని గిరిజన ప్రాంత ప్రజలు స్వాగతిస్తున్నట్లు చెప్పారు. పరిపాలన రాజధానిగా విశాఖకు మద్దతు తెలుపుతూ నినాదాలు చేశారు. వినియోగదారుల సంఘ అధ్యక్షుడు మర్రి సత్యనారాయణ, మాజీ సర్పంచి రఘునాథ్‌, పలువురు విద్యార్థులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని