logo

చిరుధాన్యాలు.. ఆయుర్వేద ఉత్పత్తులు...!

సేంద్రియ విధానంలో పండించిన పంటలను, వివిధ రకాల ఉత్పత్తులను వినియోగదారులకు చేరువ చేసేందుకు రైతు సాధికార సంస్థ, ఆంధ్రప్రదేశ్‌ కమ్యూనైజ్డ్‌ నేచురల్‌ ఫార్మింగ్‌ (ఏపీసిఎన్‌ఎఫ్‌) ఆధ్వర్యంలో భూమి

Updated : 03 Jun 2023 02:49 IST

విశాఖ ఆర్గానిక్‌ మేళా ప్రారంభం

వివిధ రకాల కంకులు

విశాఖపట్నం, న్యూస్‌టుడే  : సేంద్రియ విధానంలో పండించిన పంటలను, వివిధ రకాల ఉత్పత్తులను వినియోగదారులకు చేరువ చేసేందుకు రైతు సాధికార సంస్థ, ఆంధ్రప్రదేశ్‌ కమ్యూనైజ్డ్‌ నేచురల్‌ ఫార్మింగ్‌ (ఏపీసిఎన్‌ఎఫ్‌) ఆధ్వర్యంలో భూమి ఆర్గానిక్స్‌ సహకారంతో చేపట్టిన అంతర్జాతీయ సేంద్రియ ఉత్పత్తుల మేళా (విశాఖ ఆర్గానిక్‌ మేళా) నగరవాసులను ఆకర్షిస్తోంది. ఎంవీపీకాలనీ గాదిరాజు ప్యాలెస్‌ ఆవరణలో సుమారు 70 స్టాల్స్‌తో ఏర్పాటు చేసిన ఈ మేళాను వ్యవసాయశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి, రైతు సాధికారసంస్థ ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ఛైర్మన్‌ టి.విజయ్‌కుమార్‌ శుక్రవారం ప్రారంభించారు. రాష్ట్ర మార్కెటింగ్‌ అధికారి ప్రభాకర్‌, ఆరు జిల్లాల డీపీఎంలు, ప్రాంతీయ సమన్వయకర్త పాల్గొన్నారు. ఈ మేళాలో ఆచార్య ఎన్‌.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన విజ్ఞాన కేంద్రాల్లో రూపొందించిన వివిధ రకాల విత్తనాలు, సేంద్రియ విధానంలో పండించిన కూరగాయలు, ఆహార ఉత్పత్తులను, పక్షులకు ఆహారంగా ఇళ్ల ముందు వేలాడ దీయడం కోసం తీర్చిదిద్దిన వరి కంకులు, ఔషధ మొక్కలు, ఆయుర్వేద ఔషధాలు, తాటి బెల్లం, రసాయనాలు లేని సబ్బులు తదితరాలెన్నో ఈ ప్రదర్శనలో అందుబాటులో ఉంచారు. ఈ మేళా ఆదివారం వరకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుందని నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని