logo

నాటుసారా తయారుచేస్తే కఠిన చర్యలు

అరకులోయ సర్కిల్‌ పరిధిలో అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడిన మద్యం, నాటుసారా నిల్వలను ఏఎస్పీ ధీరజ్‌ పర్యవేక్షణలో పోలీసు, రెవెన్యూ అధికారుల సమక్షంలో శుక్రవారం ధ్వంసం చేశారు.

Published : 03 Jun 2023 02:40 IST

మద్యం నిల్వలను పరిశీలిస్తున్న ఏఎస్పీ ధీరజ్‌, పోలీసులు

అరకులోయ, న్యూస్‌టుడే: అరకులోయ సర్కిల్‌ పరిధిలో అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడిన మద్యం, నాటుసారా నిల్వలను ఏఎస్పీ ధీరజ్‌ పర్యవేక్షణలో పోలీసు, రెవెన్యూ అధికారుల సమక్షంలో శుక్రవారం ధ్వంసం చేశారు. 1096 మద్యం సీసాలు, 47 లీటర్ల నాటుసారాను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ అక్రమంగా మద్యం విక్రయించినా, రవాణాకి పాల్పడినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతం కావటంతో అక్రమంగా మద్యం విక్రయాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందని, దీనిపై నిఘా పెంచామన్నారు. గ్రామాల్లో నాటుసారా తయారీ, విక్రయాలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. సీఐ రుద్రశేఖర్‌, ఎస్‌ఐ సంతోష్‌కుమార్‌, పోలీస్‌, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

దేవీపట్నం: నాటు సారా తయారుచేసినా, తయారీని ప్రోత్సహించినా కఠిన చర్యలు తప్పవని రంపచోడవరం ఏఎస్పీ జగదీష్‌ అదహళ్లి హెచ్చరించారు. దేవీపట్నం మండలం పెదభీంపల్లి పునరావాస కాలనీలో ఉన్న దేవీపట్నం పోలీసు స్టేషన్‌ను ఏఎస్పీ శుక్రవారం సందర్శించారు. ఈ నేపథ్యంలో మండలంలో ఇప్పటి వరకూ 19 కేసుల్లో పట్టుబడిన 275 లీటర్ల నాటుసారాతోపాటు బీరు సీసాలను ఆయన ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. అనంతరం స్టేషన్‌ దస్త్రాలను తనిఖీ చేశారు. స్టేషన్‌ పరిధిలోని నమోదవుతున్న కేసుల వివరాలపై ఏఎస్పీ ఆరా తీశారు. కార్యక్రమంలో ఎస్సై కె.వి.నాగార్జున, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని