logo

మలుపులో నిలిచిన కంటెయినర్‌

అనంతగిరి ఘాట్‌రోడ్డులో భారీ కంటెయినర్‌ నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Published : 04 Jun 2023 04:40 IST

అనంతగిరి, న్యూస్‌టుడే: అనంతగిరి ఘాట్‌రోడ్డులో భారీ కంటెయినర్‌ నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్థానికులు అందించిన వివరాల మేరకు... అరకులోయ ప్రాంతం వైపు నుంచి మైదాన ప్రాంతానికి వెళుతున్న భారీ కంటెయినర్‌ కొదమగుడ సమీపంలోని మలుపు వద్ద అడ్డంగా నిలిచిపోయింది. మలుపు తిరిగే సమయంలో వాహనం భారీగా ఉండటంతో వెనుక చక్రాలు రోడ్డుపై నుంచి కిందకు వర్షపు నీరు పారే కాలువలోకి దిగిపోయాయి. దీంతో లారీ ఓ వైపునకు ఒరిగిపోయి ముందుకు కదిలేందుకు వీల్లేకుండా ఉండిపోయింది. మలుపు కావటంతో మిగతా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని