logo

సంక్షేమం అమలు సత్తా చంద్రన్నకే

రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి చిత్తశుద్ధితో సంక్షేమ పథకాలను అమలుచేసే సత్తా కేవలం తెదేపా అధినేత చంద్రబాబునాయుడికే ఉందని, ప్రతిఒక్కరు ఆయనకు మద్దతుగా నిలవాలని జడ్పీటీసీ సభ్యుడు వాళ్ల రంగారెడ్డి, జడ్పీటీసీ మాజీ సభ్యుడు ముత్యాల రామారావు, ఎంపీటీసీ సభ్యుడు వాళ్ల వెంకటేశ్వర్రావురెడ్డి అన్నారు.

Published : 04 Jun 2023 05:20 IST

పోచవరంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం

వరరామచంద్రాపురం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి చిత్తశుద్ధితో సంక్షేమ పథకాలను అమలుచేసే సత్తా కేవలం తెదేపా అధినేత చంద్రబాబునాయుడికే ఉందని, ప్రతిఒక్కరు ఆయనకు మద్దతుగా నిలవాలని జడ్పీటీసీ సభ్యుడు వాళ్ల రంగారెడ్డి, జడ్పీటీసీ మాజీ సభ్యుడు ముత్యాల రామారావు, ఎంపీటీసీ సభ్యుడు వాళ్ల వెంకటేశ్వర్రావురెడ్డి అన్నారు. శనివారం వరరామచంద్రాపురం మండలం తుమ్మిలేరు పంచాయతీ పోచవరంలో మండల తెలుగు మహిళల ఆధ్వర్యంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. తెదేపా మేనిఫెస్టోలో అన్ని వర్గాలకు పథకాలను ప్రకటించి న్యాయం చేశారన్నారు. తెలుగు మహిళ అధ్యక్షురాలు అక్రోజు భాగ్యలక్ష్మి, వైస్‌ ఎంపీపీలు వడ్డానపు భాగ్యలక్ష్మి, ముర్ల మంగిరెడ్డి, సర్పంచి అందెల సీతారామరాజు, ఎండీ రహీమ్‌, బీరక సూర్యప్రకాశరావు, కనకారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని