ఎనిమిదేళ్ల క్రితం పనులు..ఇప్పుడు తనిఖీలు!
గత ప్రభుత్వం చేపట్టిన పనులపై విజిలెన్స్ తనిఖీలు, నివేదికల పేరుతో పంచాయతీరాజ్ ఇంజినీర్ల మెడపై సర్కారు కత్తి వేలాడదీస్తోంది.
రూ-అర్బన్ పనుల పరిశీలనకు ప్రత్యేక బృందాలు
అరకులోయ ఎంపీడీవో కార్యాలయంలో రికార్డులు పరిశీలిస్తున్న అధికారులు
ఈనాడు డిజిటల్, పాడేరు, న్యూస్‌టుడే అరకులోయ: గత ప్రభుత్వం చేపట్టిన పనులపై విజిలెన్స్ తనిఖీలు, నివేదికల పేరుతో పంచాయతీరాజ్ ఇంజినీర్ల మెడపై సర్కారు కత్తి వేలాడదీస్తోంది. సిమెంట్ రోడ్ల నిర్మాణం, ఎస్‌డీఎఫ్ నిధులతో చేపట్టిన పనులకు సంబంధించి ఇంజినీర్లపై చర్యలకు ఉపక్రమిస్తోంది. తాజాగా నేషనల్ రూరల్ అర్బన్ మిషన్ (రూ-అర్బన్) నిధులతో గత ప్రభుత్వ హయాంలో చేసిన పనులపై తనిఖీలకు ఆదేశించింది. అరకులోయలో రూ-అర్బన్ పథకంలో చేసిన వివిధ పనులకు సంబంధించి దస్త్రాలను శుక్రవారం నుంచి తనిఖీలు చేస్తున్నారు. జిల్లా పరిషత్తు డిప్యూటీ సీఈవో సత్యనారాయణ ఆధ్వర్యంలోని ఓ బృందం పనుల వివరాలన్నింటినీ నిశితంగా పరిశీలిస్తోంది. ఎనిమిదేళ్ల క్రితం నాటి పనులపై ఇప్పుడు పరిశీలించడంపై ఇంజినీర్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
తెదేపా హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరకులోయలోని పెదలబుడు పంచాయతీని దత్తత తీసుకున్నారు. ఆ పంచాయతీ పరిధిలో 11 శివారు గ్రామాలున్నాయి. ప్రముఖ పర్యాటక ప్రాంతం కావడంతో రాష్ట్రంలోనే ఆదర్శవంతంగా ఈ పంచాయతీని తీర్చిదిద్దాలనుకున్నారు. అందులో భాగంగా రూ-అర్బన్ మిషన్‌లో పనులు చేపట్టారు. సుమారు రూ.52 కోట్ల అంచనాతో 287 పనులు చేశారు. ఇందులో రూ.15 కోట్లు కేంద్ర ప్రభుత్వ నిధులు (సీజీఎఫ్) కాగా, రూ.18.20 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుచేసింది. మరో రూ.18.87 కోట్ల ఉపాధిహామీ నిధులను ఉపయోగించారు. పెదలబుడు పంచాయతీ గంజాయిగుడ వద్ద గిరి గ్రామదర్శినికి రూ.15 లక్షలు వెచ్చించారు.. పద్మాపురం పంచాయతీ రణజిల్లెడ జలపాతానికి వెళ్లే మార్గంలో రూ.20 లక్షలతో సీసీ రోడ్డు నిర్మించారు. అరకులోయ పట్టణంలో రూ.కోటితో భూగర్భ డ్రైనేజీ పనులు చేపట్టారు. వీటితో పాటు సుమారు రూ.8 కోట్లతో సీసీ రోడ్లు నిర్మించారు.. ముందుగా ఈ పనుల వివరాలన్నింటిని మండల పరిషత్తు నుంచి తెప్పించుకుని పరిశీలిస్తున్నారు..ఏ పనికి ఎంత నిధులు వెచ్చించారు.. ఎంత మేర చెల్లింపులు జరిగాయి.. ఎవరి పేరున ఎం.బుక్ నమోదు చేశారు.. అప్పట్లో నాణ్యత తనిఖీలు ఏమైనా చేశారా.. వాటిలో ఎక్కడైనా లోపాలు గుర్తించారా.. పనుల నిర్వహణకు సంబంధించి దస్త్రాలన్నింటిని తమ ముందు పెట్టుకుని జల్లెడ పడుతున్నారు. జడ్పీ నుంచి లీగల్ విభాగం సిబ్బంది ఈ తనిఖీలో పాల్గొంటున్నారు. ఇవి పూర్తయిన తర్వాత దస్త్రాల్లో ఉన్న పనులు క్షేత్రస్థాయిలో ఉన్నాయా లేవా.. వాటి నాణ్యత ఇప్పుడు ఎలా ఉంది.. జరిగిన పని కంటే ఎక్కువ మొత్తంలో ఏమైనా చెల్లింపులు జరిగాయా.. పనుల్లేకుండా బిల్లులేమైనా చేసుకున్నారా అనే అంశాలను లోతుగా పరిశీలించడానికి ప్రత్యేక సాంకేతిక బృందాలను పంపించబోతున్నారు. నెల రోజులకు పైగా ఈ తనిఖీలు జరగనున్నట్లు తెలిసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India-Canada: భారత్‌తో తెరవెనుక చర్చలను కొనసాగిస్తాం: కెనడా
-
Pawan Kalyan: పవన్‌కు కృష్ణా జిల్లా ఎస్పీ నోటీసులు
-
కేబినెట్ ఆమోదం పొందాకే అమల్లోకి సీమెన్స్ ప్రాజెక్టు: చంద్రబాబు తరఫు న్యాయవాది వాదనలు
-
ODI WC 2023: అశ్విన్ ఎంపికపై భజ్జీ కామెంట్లు.. నెట్టింట మరోసారి సంజూ వైరల్!
-
Lalu Prasad Yadav: భూ కుంభకోణం కేసులో లాలూకు స్వల్ప ఊరట
-
Supreme Court: ఈడీ ప్రతీకార చర్యలకు పాల్పడకూడదు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు