logo

ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు పొదుపు అవసరం

గిరిజనులు ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే పొదుపు అవసరమని, ప్రతిఒక్కరు తపాలాశాఖలో పొదుపు ఖాతా ప్రారంభించాలని ఎంపీపీ అనూషాదేవి అన్నారు.

Published : 06 Jun 2023 05:51 IST

పొదుపు ఖాతా పుస్తకాన్ని అందిస్తున్న ఐపీఓ ఉపేంద్ర

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: గిరిజనులు ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే పొదుపు అవసరమని, ప్రతిఒక్కరు తపాలాశాఖలో పొదుపు ఖాతా ప్రారంభించాలని ఎంపీపీ అనూషాదేవి అన్నారు. సోమవారం తపాలాశాఖ సూపరింటెండెంట్‌ ప్రసాద్‌బాబు (అనకాపల్లి), సౌత్‌ సబ్‌ డివిజన్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావు (నర్సీపట్నం) ఆధ్వర్యంలో వన్‌జన్‌ధన్‌ కార్యక్రమం నిర్వహించారు. ఎంపీపీ మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలో నివసించే ప్రతి కుటుంబానికి పోస్టాఫీసులో పొదుపు ఖాతా, ఇన్సూరెన్స్‌ పాలసీలు ఉండాలని, తద్వారా కుటుంబం ఆర్థికంగా ఎదిగేందుకు దోహదపడుతుందన్నారు. అనంతరం ర్యాలీ చేపట్టారు. సర్పంచి దురియా పుష్పలత, పైలా శ్రీను, పోస్టల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

ముంచంగిపుట్టు, న్యూస్‌టుడే: మన్యంలో ప్రతి వ్యక్తికి పోస్టాఫీసు పొదుపు పథకం అందించటమే వన్‌జన్‌ధన్‌ లక్ష్యమని అరకు సబ్‌ డివిజన్‌ తపాలాశాఖ ఐపీ అధికారి బి.ఉపేంద్ర అన్నారు. పొదుపుతో కుటుంబానికి భరోసా ఉంటుందని చెప్పారు. సోమవారం అరకుకోలానీ, పెదబయలు ఉప తపాలా కార్యాలయాల్లో వన్‌జన్‌ధన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి కుటుంబానికి పొదుపు ఖాతా తెరవాలన్నారు. పోస్టాఫీసుల్లో పొదుపు ఖాతా ద్వారా అధిక వడ్డీ పొందగలమని పెదలబుడు గ్రామ సర్పంచి దాసుబాబు అన్నారు. ఎస్‌పీఎం నాగరాజు, భీమరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని