logo

‘అర్హుల పింఛన్లు తొలగిస్తే సహించం’

అర్హులైన పేదల పింఛన్లు తొలగించడాన్ని సహించబోమని మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌ పేర్కొన్నారు. పింఛన్ల తొలగింపును నిరసిస్తూ తెదేపా ఆధ్వర్యంలో సోమవారం అరకులోయలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

Published : 06 Jun 2023 05:53 IST

తహసీల్దారుకు వినతిపత్రం అందజేస్తున్న మాజీ మంత్రి శ్రావణ్‌, తెదేపా నాయకులు

అరకులోయ, న్యూస్‌టుడే: అర్హులైన పేదల పింఛన్లు తొలగించడాన్ని సహించబోమని మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్‌ పేర్కొన్నారు. పింఛన్ల తొలగింపును నిరసిస్తూ తెదేపా ఆధ్వర్యంలో సోమవారం అరకులోయలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం అధికారులకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైకాపా ప్రభుత్వం ఎన్నికల్లో పింఛను సొమ్మును పెంచుతామని ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు లబ్ధిదారులను తగ్గిస్తోందన్నారు. గిరిజన ప్రాంతంలో ఐదెకరాల భూమి ఉన్నా ఏ పంటా పండదని చెప్పారు. వైకాపా అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు మూల్యం చెల్లించుకుంటుందని చెప్పారు. తొలగించిన పింఛన్లను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం తహసీల్దారుకు వినతిపత్రం సమర్పించారు. పార్టీ మండల అధ్యక్షుడు శెట్టి బాబూరావు, తెదేపా నాయకులు సాయిరాం, శ్యామ్‌, కళావతి, నీరజ, రమేష్‌, రెహమాన్‌, రత్నం రాజు, చట్టు అప్పలరాజు, నగేష్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని