logo

ప్లాస్టిక్‌ రహిత సమాజ స్థాపనకు కృషి

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్‌ రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ పిలుపునిచ్చారు.

Published : 06 Jun 2023 05:56 IST

మొక్కలు నాటుతున్న ఎంపీ మాధవి, కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, ఐటీడీఏ పీఓ అభిషేక్‌, అటవీ శాఖాధికారి వినోద్‌బాబు,
రాష్ట్ర ట్రైకార్‌ ఛైర్మన్‌ బుల్లిబాబు తదితరులు

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్‌ రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ పిలుపునిచ్చారు. సోమవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని స్థానిక మోదకొండమ్మ పాదాలు, కిండంగి మామిడి తోటల పరిసరాల్లో ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి, ఐటీడీఏ పీవో వి.అభిషేక్‌, అటవీ, పంచాయతీ, రెవెన్యూ, ఐటీడీఏ, గిరిజన సంక్షేమ, సచివాలయ శాఖల అధికారులు, సిబ్బందితో కలసి చెత్త, వ్యర్థాలు తొలగించారు. ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ దురదృష్టవశాత్తు మన్యంలోనూ ప్లాస్టిక్‌ వినియోగం పెరిగిందని, పర్యాటకులకు కూడా అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, తడి, పొడి చెత్తలను వేరుచేసి తద్వారా సంపద సృష్టించాలని సూచించారు. ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అనంతరం చెత్త బుట్టలు పంపిణీ చేశారు. జిల్లా అటవీశాఖ అధికారి వినోద్‌బాబు, జిల్లా పంచాయతీ అధికారి కొండలరావు, డివిజనల్‌ పంచాయతీ అధికారి వి.ఎస్‌.కుమార్‌, గిరిజన సంక్షేమశాఖ ఉప సంచాలకులు కొండలరావు, తహసీల్దారు త్రినాథరావునాయుడు, ఎంపీపీ రత్నకుమారి, మాజీ ఎంపీపీ ఎస్‌.వి.రమణ పాల్గొన్నారు.

* అనంతరం కుమ్మరిపుట్టు గురుకుల సంక్షేమ ఆశ్రమ పాఠశాల ఆవరణలో కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, ఎంపీ మాధవి, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, ఐటీడీఏ పీఓ అభిషేక్‌, అటవీ శాఖాధికారి వినోద్‌బాబు, ట్రైకార్‌ ఛైర్మన్‌ బుల్లిబాబుతో కలిసి మొక్కలు నాటారు. ముఖ్యఅతిథులు మాట్లాడుతూ అవకాశం ఉన్న ప్రతిచోటా మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని