logo

భవిత కేంద్రం.. భయం భయం

విభిన్న ప్రతిభావంతులైన చిన్నారులకు విద్యనందించే నక్కపల్లిలోని భవిత కేంద్రం శిథిలావస్థకు చేరుతోంది. భవనం బయట, లోపల ఎక్కడికక్కడే పెచ్చులూడుతూ, బీటలు వారుతోంది.

Published : 07 Jun 2023 02:12 IST

నక్కపల్లిలోని భవిత కేంద్రం

నక్కపల్లి, న్యూస్‌టుడే: విభిన్న ప్రతిభావంతులైన చిన్నారులకు విద్యనందించే నక్కపల్లిలోని భవిత కేంద్రం శిథిలావస్థకు చేరుతోంది. భవనం బయట, లోపల ఎక్కడికక్కడే పెచ్చులూడుతూ, బీటలు వారుతోంది. ఇక్కడకు వివిధ గ్రామాల నుంచి సుమారు 20 మంది వరకు వస్తున్నారు. వీరికి బ్రెయిలీ లిపి నేర్పించడం, బుద్ధి మాంద్యం ఉన్నవారికి జీవన నైపుణ్యాలు, ఒకేషన్‌లో శిక్షణ, విద్య తదితర వాటిని నేర్పిస్తారు. ఫిజియో థెరపీ చేస్తుంటారు. భవనంలో రెండు గదులు, వరండా, హాలు ఉంది. వీటిని ఇక్కడకు వచ్చే చిన్నారులకు ఉపయోగించడంతోపాటు, అవసరమైన సామగ్రి పరికరాలు భద్రపరుస్తారు. కాగా ఈ భవనం క్రమేపీ దెబ్బతింటోంది. కేంద్రంలోకి వెళ్లే మెట్ల మార్గం బీటలు వారింది. లోపల గదుల గోడలన్నీ పగుళ్లిచ్చాయి. పిల్లర్ల వద్ద ఖాళీ వచ్చింది. ముఖ్యంగా ద్వార బంధాలు విడిపోతున్నాయి. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో విద్యార్థులు రావడంలేదు. త్వరలోనే సెలవులు ముగిసి తిరిగి వీరంతా రానున్నారు. భవనం పరిస్థితి చూసి చిన్నారుల తల్లిదండ్రులు భయాందోళనలు చెందుతున్నారు. పెచ్చులూడితే ప్రమాదం జరిగే అవకాశం ఉండటంతో. కనీసం వీటికి మరమ్మతులు చేయించి సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు.

శ్లాబు వద్ద పరిస్థితి

ద్వార బంధం వద్ద ఏర్పడిన పగుళ్లు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని