logo

పండగ వేళ.. జన హేల

దేవరాపల్లి గ్రామం మంగళవారం జన సంద్రమైంది. గ్రామ దేవత సన్యాసమ్మ తల్లి పండగ వేళ వీధులన్నీ కిటకిటలాడాయి. అబ్బురపరిచే వేషధారణలు ఆకట్టుకున్నాయి.

Published : 07 Jun 2023 02:12 IST

ఆకట్టుకున్న వేషధారణలు

ఆకట్టుకున్న అమ్మవారి ప్రభలు

దేవరాపల్లి, న్యూస్‌టుడే: దేవరాపల్లి గ్రామం మంగళవారం జన సంద్రమైంది. గ్రామ దేవత సన్యాసమ్మ తల్లి పండగ వేళ వీధులన్నీ కిటకిటలాడాయి. అబ్బురపరిచే వేషధారణలు ఆకట్టుకున్నాయి. కళ్లు మిరుమిట్లు గొలిపే అమ్మవారి ప్రభలు ఆధ్యాత్మితకతకు ఆలవాలంగా, నింగిని తాకిన చందంగా కనిపించాయి. అమ్మవారి ఘటాల ఊరేగింపు ఘనంగా జరిగింది. అమ్మవారిని దర్శించుకోవడానికి మంగళవారం వేకువజాము నుంచే భక్తులు తరలిరావడంతో ఆ ప్రాంతమంతా జనంతో కిక్కిరిసిపోయింది. ట్రాఫిక్‌కు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎస్‌.ఐ. నాగేంద్రతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పోలీసు బలగాలు బందోబస్తు నిర్వహించారు. సన్యాసమ్మ తల్లిని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు దంపతులు దర్శించుకున్నారు. ఆలయ కమిటీ ఛైర్మన్‌ లలితానాయుడు, ఉత్సవ కమిటీ ఛైర్మన్‌ కిలపర్తి భాస్కరరావు, సర్పంచి సబ్బవరపు పెంటమ్మ తదితరులు వారిని సత్కరించారు. జడ్పీటీసీ సభ్యుడు కర్రి సత్యం, వైకాపా మండలశాఖ అధ్యక్షుడు బూరె బాబూరావు, డా. సింహాచలంనాయుడు, శాసనమండలి మాజీ సభ్యుడు బుద్ధ నాగజగదీశ్వరరావు, తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి పీవీజీ కుమార్‌, జడ్పీటీసీ మాజీ సభ్యురాలు గాలి వరలక్ష్మి, తెదేపా నాయకుడు గాలి రవికుమార్‌ తదితరులు అమ్మవారిని దర్శించుకున్నవారిలో ఉన్నారు. రాత్రికి జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.


జన సంద్రంగా మారిన దేవరాపల్లి వీధులు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని