రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీలకు ఎంపిక
విజయవాడ లయోలా కళాశాలలో ఈ నెల 9 నుంచి 11 వరకు ఏపీ బాక్సింగ్ అసోసియేషన్ నిర్వహించనున్న జూనియర్ బాలబాలికల బాక్సింగ్ రాష్ట్ర స్థాయి పోటీలకు నర్సీపట్నం
నర్సీపట్నం అర్బన్, న్యూస్‌టుడే: విజయవాడ లయోలా కళాశాలలో ఈ నెల 9 నుంచి 11 వరకు ఏపీ బాక్సింగ్ అసోసియేషన్ నిర్వహించనున్న జూనియర్ బాలబాలికల బాక్సింగ్ రాష్ట్ర స్థాయి పోటీలకు నర్సీపట్నం నింజాస్ అకాడమీ నుంచి ఆరుగురు ఎంపికయ్యారని శాప్ కోచ్ అబ్బు పేర్కొన్నారు. వీరిలో ఆర్.లిఖిత, కె.జాహ్నవి, బి.రాజేశ్వరి, కేబీఎం తేజ, ఎస్.జస్వంత్ రాఘవేంద్ర, ఎ.శశికుమార్ ఉన్నారు. ఈ పోటీల్లో బంగారు పతకం సాధించిన వారు అరుణాచల్‌ప్రదేశ్‌లో జరగనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవుతారన్నారు.
జాతీయ స్థాయి హాకీ పోటీలకు నలుగురు..
నక్కపల్లి, న్యూస్‌టుడే: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా 66వ నేషనల్ స్కూల్ గేమ్స్‌కు నక్కపల్లి బీఎస్ హాకీ క్రీడాకారులు నలుగరు ఎంపికైనట్లు ఫౌండర్ బలిరెడ్డి సూరిబాబు, కార్యదర్శి కొల్నాటి తాతాజీ గురువారం తెలిపారు. నక్కపల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి హాకీ పోటీల్లో పి.రోహిత్, కె.అనురాధ, బి.అభిషేక్, ఎస్.మణికంఠ మంచి ప్రతిభ కనబర్చి జాతీయ పోటీలకు అర్హత సాధించినట్లు తెలిపారు. ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో నిర్వహించనున్న జాతీయస్థాయి హాకీ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. క్రీడాకారులను శిక్షకులు రాంబాబు, కె.నానాజీ, రామచంద్రరావు, ప్రసాద్ తదితరులు అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Boney Kapoor: శ్రీదేవి మరణం.. డైట్ వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది: బోనీ కపూర్
-
Social Look: సమంత కల.. రుక్సార్ హొయలు.. నిహారిక ఫొటోషూట్
-
Guntur Kaaram: అందుకే పూజా హెగ్డేను రీప్లేస్ చేశాం: నిర్మాత నాగవంశీ
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/10/2023)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Nitin Gadkari : ప్రపంచంలోనే రెండో అతిపెద్ద రోడ్ నెట్వర్క్ మాదే కానీ..: గడ్కరీ