స్టెప్పేస్తే మెరుపు.. లోకేష్‌దే గెలుపు
చిన్నప్పటి నుంచి నృత్యంపై ఉన్న ఆసక్తి ఆ యువకుడిని ఢీ టైటిల్ విజేతగా నిలిపేలా చేసింది. ఈటీవీలో ఢీ-15లో ఎస్9 టీంలో అనకాపల్లికి చెందిన కర్రి లోకేష్ తొమ్మిది మంది సభ్యుల్లో
ఢీ షోలో అదరగొట్టిన అనకాపల్లి కుర్రాడు
కుటుంబ సభ్యులతో..
అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: చిన్నప్పటి నుంచి నృత్యంపై ఉన్న ఆసక్తి ఆ యువకుడిని ఢీ టైటిల్ విజేతగా నిలిపేలా చేసింది. ఈటీవీలో ఢీ-15లో ఎస్9 టీంలో అనకాపల్లికి చెందిన కర్రి లోకేష్ తొమ్మిది మంది సభ్యుల్లో ఒకరిగా ఢీ టైటిల్ విజేత ట్రోఫీ అందుకున్నాడు. దీనికి గాను బృందానికి రూ.75 లక్షల నగదు వచ్చినట్లు లోకేష్ తెలిపారు.
అనకాపల్లికి చెందిన కర్రి లోకేష్ బీటెక్ పూర్తి చేశాడు. చిన్నప్పుడే తండ్రి చనిపోవడంతో తల్లి నాగమణి కిరాణాషాపు పెట్టి కుటుంబాన్ని నెట్టుకొచ్చింది. ముగ్గురు కుమారుల్లో చిన్నవాడైన లోకేష్‌కు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఆసక్తి. తొమ్మిదో తరగతి చదువుతున్న సమయంలో వారియర్స్ డాన్స్ ట్రూప్‌లో నృత్య సాధన చేసేవాడు. పలు ప్రదర్శనలు ఇచ్చాడు. 2019లో విశాఖపట్నం బాబీ మాస్టర్ గ్రూపులో బ్యాక్ గ్రౌండ్ డాన్సర్‌గా తొలిసారిగా ఈటీవీ ఢీ షోలో పాల్గొన్నాడు. 2020లో చెర్రి మాస్టర్ గ్రూపులో, ఢీ-13 సాయి గ్రూపులో, ఢీ-14లో సోమేష్ మాస్టర్ గ్రూపులో బ్యాక్ గ్రౌండ్ డాన్సర్‌గా గుర్తింపు పొందాడు. అలా ఢీ-15లో సోమేష్ సారథ్యంలో ఎస్9లో తొమ్మిది మంది డాన్సర్‌లతో కలిసి టీంగా పోటీలో పాల్గొన్నారు. ఈ పోటీలో అద్భుత ప్రతిభతో ఈ టీం టైటిల్ విజేతగా నిలిచింది. మే 31న టైటిల్‌ను అందుకున్నారు. ఇది తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని లోకేష్ ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. ఈ సందర్భంగా లోకేష్‌ను అనకాపల్లి వాసులు, కళాకారులు అభినందించారు.
జీవితాల్ని మార్చేసిన షో..
డాన్సర్లకు ఈటీవీ ఢీషో వరంగా మారింది. జీరోగా ఉన్న ఎంతో మందిని హీరోలుగా చేసింది. ఎంతో మంది డాన్స్ మాస్టర్లు ఈ షో ద్వారా వెలుగులోకి వచ్చారు. నా లాంటి ఎంతో మందికి మంచి జీవితాన్ని అందించింది. ఒక్కసారి ఇందులో ప్రవేశిస్తే వారి జీవితమే మారిపోతుంది.
కర్రి లోకేష్, అనకాపల్లి
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu Arrest: ఆంక్షలు దాటి, పోలీసుల కళ్లు కప్పి.. ర్యాలీకి ఎమ్మెల్యే కోటంరెడ్డి
-
Sanjay Singh: ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్టు
-
TSRTC: తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు మరో శుభవార్త
-
Rohit On WC 2023: మా టార్గెట్ అదే.. అలాంటి పోలికలను పట్టించుకోం: రోహిత్
-
TS News: తెలంగాణలో ఓటర్ల జాబితా విడుదల.. వర్గాల వారీగా ఇదీ లెక్క!
-
Devara: ‘దేవర’.. ఒక్క సంభాషణా కట్ చేయలేం.. పార్ట్ 2 ప్రకటించిన కొరటాల శివ