logo

సహకార సంఘాల బలోపేతానికి సలహా కమిటీ

జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) ఆధ్వర్యంలో సహకార సంఘాల బలోపేతానికి సలహా కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని డీసీసీబీ ఛైర్‌పర్సన్‌ చింతకాయల అనిత అన్నారు.

Published : 09 Jun 2023 06:26 IST

సభ్యులకు చెక్కు అందజేస్తున్న ఛైర్‌పర్సన్‌ అనిత

విశాఖపట్నం, న్యూస్‌టుడే : జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) ఆధ్వర్యంలో సహకార సంఘాల బలోపేతానికి సలహా కమిటీ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని డీసీసీబీ ఛైర్‌పర్సన్‌ చింతకాయల అనిత అన్నారు. గురువారం ఉదయం మర్రిపాలెం వుడాలేఅవుట్‌లోని డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మహాజన సభకు ఆమె అధ్యక్షత వహించారు. సభకు సభ్యత్వం పొందిన ఏ-క్లాస్‌ ప్రాథమిక సహకార సంఘం(పీఏసీఎస్‌) ఛైర్‌పర్సన్లు, బి-క్లాస్‌ సంఘాల అధ్యక్షులు హాజరయ్యారు. 2022-23 ఆర్థిక ఏడాదిలో బ్యాంకు రూ.1.48 కోట్లు నికర లాభం ఆర్జించిందని, పీఏసీఎస్‌లకు 6 శాతం వడ్డీ అందజేస్తున్నామని బ్యాంకు ముఖ్య కార్యనిర్వాహణాధికారి డీవీఎస్‌.వర్మ తెలిపారు. అనంతరం వడ్డీ చెక్కును ఛైర్‌పర్సన్‌ చేతుల మీదుగా సభ్యులకు అందించారు. ఆప్కాబ్‌ డీజీఎం పి.బి.ప్రత్యూష, బ్యాంకు పర్సన్‌ ఇన్‌ఛార్జి కమిటీ సభ్యులు, సహకార సంఘాల ఛైర్‌పర్సన్లు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని