logo

దిల్లీకి 120 మంది ఆదివాసీల పయనం

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపు మేరకు పాడేరు ఐటీడీఏ పరిధిలోని 120 మంది ఆదివాసీలు దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌కు పయనమయ్యారు.

Published : 09 Jun 2023 06:35 IST

రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసే అవకాశం

దిల్లీ వెళ్తున్న వాహనానికి జెండా ఊపుతున్న
ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అభిషేక్‌ తదితరులు

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపు మేరకు పాడేరు ఐటీడీఏ పరిధిలోని 120 మంది ఆదివాసీలు దిల్లీలోని రాష్ట్రపతి భవన్‌కు పయనమయ్యారు. గురువారం వీరు వెళ్లే బస్సును ఐటీడీఏ కార్యాలయం వద్ద ప్రాజెక్టు అధికారి వి.అభిషేక్‌ జెండాఊపి సాగనంపారు. ఈ సందర్భంగా దిల్లీ వెళ్తున్న ఆదివాసీ గిరిజనులతో పీఓ మాట్లాడుతూ మన ఇంటి మహిళ దేశ అత్యున్నత స్థానం అధిరోహించారని గుర్తుచేశారు. ఆదివాసీల సమస్యలను తెలుసుకుని గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏపీఓలు వి.ఎస్‌ ప్రభాకర్‌, ఎం.వెంకటేశ్వరరావు, పరిపాలనాధికారి హేమలత, ట్రైకార్‌ అసిస్టెంట్‌ సీతారాం తదితరులు పాల్గొన్నారు. పాడేరు, అనంతగిరి, డుంబ్రిగుడ, హుకుంపేట, కొయ్యూరు మండలాల నుంచి 15 మంది చొప్పున, అరకులోయ నుంచి 13, ముంచంగిపుట్టు, జి.కె. వీధి మండలాల నుంచి 11 మంది చొప్పున, జి.మాడుగుల 10 మంది దిల్లీకి వెళ్లారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని