logo

స్పందనకు వందనం

మన్యంలో పసుపు కొనుగోలుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. కొనుగోలు ధర నిర్ణయించి రైతు భరోసా కేంద్రాలు, మార్క్‌ఫెడ్‌ ద్వారా గిరిజన రైతుల వద్దనున్న పసుపు కొనుగోలు చేయనున్నారు.

Published : 09 Jun 2023 06:37 IST

మే 15న ఈనాడులో ప్రచురితమైన కథనం

గూడెంకొత్తవీధి, న్యూస్‌టుడే: మన్యంలో పసుపు కొనుగోలుకు అధికారులు చర్యలు తీసుకున్నారు. కొనుగోలు ధర నిర్ణయించి రైతు భరోసా కేంద్రాలు, మార్క్‌ఫెడ్‌ ద్వారా గిరిజన రైతుల వద్దనున్న పసుపు కొనుగోలు చేయనున్నారు. గిరిజన రైతులు పండించిన పసుపు కొనుగోలుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో గ్రామాల్లో నిల్వలు పెరిగిపోయాయి. ఫలితంగా ధరలు పతనమయ్యాయి. ఈ విషయంపై మే 13న ‘పసుపుకొనేవారే కరవయ్యారు’ అనే శీర్షికన ‘ఈనాడు’లో కథనం ప్రచురితమైంది. ఈమేరకు అధికారులు కొనుగోలుకు చర్యలు తీసుకున్నారు. పసుపు క్వింటాలుకు రూ.6850 మద్దతు ధర కల్పిస్తూ కొనుగోలు చేయనున్నారని మార్క్‌ఫెడ్‌ జిల్లా మెనేజరు కె.రమేష్‌ తెలిపారు. రైతు భరోసా కేంద్రాల ద్వారానూ కొనుగోలు చేస్తామని రైతులు ఆర్బీకే బాధ్యులను సంప్రదించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని