ప్రతి ఫిర్యాదూ పరిష్కరించాల్సిందే: కలెక్టర్
స్పందనలో అందిన ప్రతి ఫిర్యాదును పరిష్కరించాల్సిందేనని జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో జరిగిన స్పందన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ అందిన ప్రతి ఫిర్యాదుకు విచారణాధికారిని నియమించాలన్నారు.
వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్ సుమిత్‌కుమార్, పీఓ వి.అభిషేక్, జేజీ శివ శ్రీనివాసు తదితరులు
పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: స్పందనలో అందిన ప్రతి ఫిర్యాదును పరిష్కరించాల్సిందేనని జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్ స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక ఐటీడీఏ సమావేశ మందిరంలో జరిగిన స్పందన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ అందిన ప్రతి ఫిర్యాదుకు విచారణాధికారిని నియమించాలన్నారు. విచారణ అనంతరం చేపట్టిన పరిష్కార వివరాలను ఫిర్యాదుదారునికి తెలియజేయాలని సూచించారు. ప్రతి అధికారి, సిబ్బంది తప్పనిసరిగా ముఖ ఆధారిత హాజరు నమోదు చేయాలన్నారు. స్పందనలో 139 ఫిర్యాదులు అందాయి. అరకులోయ మండలం కొత్తభల్లుగుడ పంచాయతీ రవ్వలగూడ గ్రామానికి చెందిన దురియా రామచందర్ జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా కోల్పోతున్న భూమికి పరిహారం ఇప్పించాలని కోరారు. కొయ్యూరు మండలం కొండగోకరి పంచాయతీ రత్నంపేటలో సీఆర్టీగా పనిచేస్తూ మృతి చెందిన రాజబాబు స్థానంలో తనకు ఏదైనా పాఠశాలలో అవకాశం కల్పించాలని అతడి భార్య ఎర్రమ్మ వినతిపత్రం అందజేశారు. పాడేరుకు చెందిన కె.మధు తాగునీటి సమస్య పరిష్కరించాలని కోరారు. హుకుంపేట మండలం రంగశీల పంచాయతీ ఒంటిపాక గ్రామానికి చెందిన జి.మల్లేశ్వరరావు ఇల్లు మంజూరు చేయాలని కోరారు. పాడేరు మండలం గబ్బంగి పంచాయతీ గబ్బంగి గ్రామానికి చెందిన తమర్బ భవాని, వెంకటరమణ అటవీ హక్కు పత్రాలు అందజేయాలని విన్నవించారు. ఐటీడీఏ పీఓ వి.అభిషేక్, సంయుక్త కలెక్టర్ శివ శ్రీనివాసు, అసిస్టెంట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాత్సవ, డీఆర్‌ఓ అంబేడ్కర్, జిల్లా, డివిజన్‌స్థాయి అధికారులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
ముగిసిన ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు.. కళాకారుల ప్రదర్శనలు అదరహో!
-
Crime news : మధ్యప్రదేశ్ అత్యాచార ఘటన.. బాధితురాలికి నా ఖాకీ చొక్కా ఇచ్చా : ఆటో డ్రైవర్
-
Rishi Sunak: ఉక్రెయిన్‌కు బ్రిటన్ సైనికులు.. రిషి సునాక్ స్పందన ఇదే!
-
Ghulam Nabi Azad: తదుపరి ‘ఎల్జీ’ అంటూ ప్రచారం.. గులాం నబీ ఆజాద్ ఏమన్నారంటే!
-
Uttar Pradesh : నాపై కక్షతో చేతబడి చేశారు.. యూపీ ఎమ్మెల్యే పోస్టు వైరల్
-
Meenakshi Chaudhary: మరో స్టార్హీరో సరసన మీనాక్షి చౌదరి.. ఆ వార్తల్లో నిజమెంత?