logo

ప్రతి అడుగు సంక్షేమం వైపే: ఎమ్మెల్యే

వైకాపా ప్రభుత్వం ప్రజా సంక్షేమం వైపే ప్రతి అడుగు వేస్తుందని, అభివృద్ధి, సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తుందని ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి అన్నారు.

Published : 10 Jun 2023 01:23 IST

గుండాలలో ప్రభుత్వ పథకాలు వివరిస్తున్న ఎమ్మెల్యే ధనలక్ష్మి

ఎటపాక, న్యూస్‌టుడే: వైకాపా ప్రభుత్వం ప్రజా సంక్షేమం వైపే ప్రతి అడుగు వేస్తుందని, అభివృద్ధి, సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తుందని ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి అన్నారు. ఎటపాకలో మండల పరిషత్తు సమావేశ హాలులో శుక్రవారం వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు. మండలంలోని గుండాలలో నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా పరిశీలించారు. లబ్దిదారులతో మాట్లాడారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఆయా శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు