logo

కలెక్టర్‌ దృష్టికి ఉపాధ్యాయ సమస్యలు

ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం ఫ్యాఫ్టో నాయకులు జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

Published : 10 Jun 2023 02:13 IST

కలెక్టర్‌కు వినతిపత్రం అందజేస్తున్న ఉపాధ్యాయ సంఘాల నేతలు

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: ఉపాధ్యాయ, విద్యా రంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం ఫ్యాఫ్టో నాయకులు జిల్లా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఫ్యాఫ్టో జిల్లా అధ్యక్షులు జగన్‌మోహన్‌రావు మాట్లాడుతూ పాఠశాల విద్యా శాఖ ప్రిన్సిపల్‌ కార్యదర్శి ఉపాధ్యాయుల పట్ల అనుసరిస్తున్న వైఖరి సరికాదన్నారు. పాఠశాలల వ్యవస్థను దెబ్బతీస్తున్న జీవో నం.117ను రద్దు చేయాలని, బోధనేతర పనుల నుంచి ఉపాధ్యాయులను మినహాయించాలని కోరారు. రెగ్యులర్‌ ప్రాతిపాదికన పదోన్నతులు ఇవ్వాలన్నారు. సీపీఎస్‌ను రద్దు చేయాలని, పీఆర్‌సీ, ఇతర బకాయిలను వెంటనే విడుదల చేయాలని విన్నవించారు. కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాలు 11వ పీఆర్‌సీకి అనుగుణంగా పెంచాలని డిమాండ్‌ చేశారు. యూటీఎఫ్‌ జిల్లా కార్యదర్శి మహేశ్వరరావు, నాయకులు కృష్టమూర్తి, శేషగిరిరావు, జానకి రామునాయుడు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని