logo

‘ఉగాది పురస్కారాల ఎంపికలో అన్యాయం’

ఉగాది పురస్కారాలు అందించడంలో తమకు అన్యాయం జరిగిందని జిల్లా వాలంటీర్ల సంఘం అధ్యక్షుడు రాంబాబు ఆవేదన వ్యక్తంచేశారు.

Published : 10 Jun 2023 02:13 IST

పాడేరులో గ్రామ వాలంటీర్ల నిరసన

పాడేరు, న్యూస్‌టుడే: ఉగాది పురస్కారాలు అందించడంలో తమకు అన్యాయం జరిగిందని జిల్లా వాలంటీర్ల సంఘం అధ్యక్షుడు రాంబాబు ఆవేదన వ్యక్తంచేశారు. పురస్కారాలకు ఎంపికవని వాలంటీర్లతో శుక్రవారం పాడేరులో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏటా వాలంటీర్ల సేవలను గుర్తించి ఉగాది సందర్భంగా సేవా వజ్ర, సేవా మిత్రా, సేవా రత్న అవార్డులు, నగదు ప్రోత్సాహకాలు అందించేవారన్నారు. ఈ ఏడాది నెల ఆలస్యంగా విజయవాడలో అందించిన ఈ పురస్కారాలకు ఎంపికలో అల్లూరి జిల్లా వాలంటీర్లకు తీరని అన్యాయం జరిగిందన్నారు. జిల్లావ్యాప్తంగా 352 సచివాలయాల పరిధిలో సుమారు 5,547 మంది వాలంటీర్లు పనిచేస్తున్నట్లు చెప్పారు. వీరిలో కేవలం 3,100 మందిని సేవా మిత్ర, 58 మందిని సేవా రత్న, 108 మందిని సేవా వజ్ర అవార్టులకు ఎంపిక చేసినట్లు చెప్పారు. పురస్కారాలకు ఎంపికవని వాలంటీర్లంతా కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు