logo

అంబులెన్సులో ప్రసవం..

మారేడుమిల్లి మండలంలో ఓ గర్భిణికి 108 అంబులెన్సులోనే సిబ్బంది ప్రసవం చేశారు. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Published : 10 Jun 2023 02:13 IST

బిడ్డను అందిస్తున్న ఈఎంపీ వెంకట్

మారేడుమిల్లి, న్యూస్‌టుడే: మారేడుమిల్లి మండలంలో ఓ గర్భిణికి 108 అంబులెన్సులోనే సిబ్బంది ప్రసవం చేశారు. శుక్రవారం ఉదయం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.   సున్నంపాడు పంచాయతీ పరిధిలోని రామన్నవలస గ్రామానికి చెందిన గర్భిణి కె.శివానీకి నెలలు నిండటంతో పురిటినొప్పులు మొదలయ్యాయి. మారేడుమిల్లిలోని 108 అంబులెన్సుకు సమాచారం అందించడంతో వారు హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. ప్రసవం కష్టమయ్యే సూచనలు కనిపించడంతో రంపచోడవరం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించడానికి బయలుదేరారు. మార్గమధ్యంలోనే నొప్పులు మరింత ఎక్కువై, పరిస్థితి విషమిస్తుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో అంబులెన్సు ఈఎంటీ వెంకట్, పైలట్ పీవీబీ రెడ్డి చొరవ తీసుకుని ప్రసవం చేశారు. శివానీ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం మెరుగైన వైద్యం కోసం వారిని పెద్దగెద్దాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్పించారు. తల్లీబిడ్డా సంపూర్ణ ఆరోగ్యంతో ఉండడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని