logo

పంచాయతీలో రూ.30 లక్షల గోల్‌మాల్‌

రంపచోడవరం మేజరు పంచాయతీలో గతంలో పనిచేసిన కార్యదర్శి సత్యనారాయణమూర్తి భారీగా నిధులు గోల్‌మాల్‌ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Updated : 21 Sep 2023 06:59 IST

రంపచోడవరం పంచాయతీ కార్యాలయం (ప్రస్తుత సచివాలయం)

రంపచోడవరం, న్యూస్‌టుడే: రంపచోడవరం మేజరు పంచాయతీలో గతంలో పనిచేసిన కార్యదర్శి సత్యనారాయణమూర్తి భారీగా నిధులు గోల్‌మాల్‌ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పంచాయతీలో ఇంటి, కుళాయి పన్నులతో పాటు పారిశుద్ధ్యానికి వినియోగించే నిధులను రూ.లక్షల్లో కాజేసినట్టు అధికారులు గుర్తించారు. అనారోగ్యంతో మృతిచెందిన పారిశుద్ధ్య కార్మికుని వేతనాన్ని సైతం ఏడాది పాటు డ్రా చేసుకొని కాజేసినట్లు సమాచారం. ఇటీవల అధికారులు పంచాయతీ రికార్డులు తనిఖీ చేయగా అప్పటి కార్యదర్శి నిధులను కాజేసినట్టు గుర్తించి డీపీవో కొండలరావు దృష్టికి తీసుకెళ్లారు. నిధుల దుర్వినియోగంపై ఆయన విచారణకు ఆదేశించారు. దీంతో బుధవారం డివిజనల్‌ పంచాయతీ అధికారి రాఘవన్‌ ఆధ్వర్యంలో స్థానిక పంచాయతీ కార్యాలయంలో విచారణ చేపట్టారు. ఇదిలా ఉండగా ఇప్పటికే దుర్వినియోగానికి పాల్పడిన పంచాయతీ కార్యదర్శి నుంచి రూ.30లక్షల వరకు నగదును రికవరీ చేసినట్టు సమాచారం. దీనిపై డీఎల్‌పీవో రాఘవన్‌ను వివరణ కోరగా నిధుల దుర్వినియోగం వాస్తవమేనని, ప్రస్తుతం విచారణ చేస్తున్నామన్నారు. అతబుధవారం సీఎఫ్‌ఎంఎస్‌ వెబ్‌సైట్‌ ఓపెన్‌ కాలేదని, మరో రెండు రోజులపాటు పూర్తిస్థాయిలో విచారణ చేసి నివేదికను డీపీవోకు అందిస్తామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని