logo

మాతా శిశు మరణాలు అరికట్టేందుకు చర్యలు

మాతా శిశు మరణాలు అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి సాధన అన్నారు.

Published : 21 Sep 2023 02:44 IST

లోతుగెడ్డ పీహెచ్‌సీలోని వైద్యసిబ్బందితో మాట్లాడుతున్న జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డా. సాధన

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: మాతా శిశు మరణాలు అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి సాధన అన్నారు. బుధవారం లోతుగెడ్డ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆమె ఆకస్మిక తనిఖీలు చేశారు. వ్యాధి నిరోధక టీకాలు, వాటి శీతలీకరణ, నాణ్యత పరిశీలించారు. గర్భిణులు, చిన్నారులకు సకాలంలో టీకాలు వేయాలని, పర్యవేక్షణ సిబ్బంది గ్రామాలను సందర్శించి గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు. వార్డులు, ప్రసూతి గదిని పరిశీలించారు. సుఖప్రసవాలు అధికంగా జరగడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. వైద్యులు లక్ష్మీకాంత్‌, జానకి, సిబ్బంది భూలోకమ్మ, సింహాద్రి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని