logo

భాజపా, వైకాపాలను ఇంటికి సాగనంపుదాం

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి అధికారం కైవసం చేసుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుటిల యత్నాలకు పాల్పడుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జె.వి.సత్యనారాయణమూర్తి అన్నారు.

Published : 21 Sep 2023 02:44 IST

సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సత్యనారాయణమూర్తి

సమావేశంలో మాట్లాడుతున్న సత్యనారాయణమూర్తి

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి అధికారం కైవసం చేసుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కుటిల యత్నాలకు పాల్పడుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జె.వి.సత్యనారాయణమూర్తి అన్నారు. బుధవారం పార్టీ జిల్లా అధ్యక్షుడు పొట్టిక సత్యనారాయణ అధ్యక్షతన గిరిజన ఉద్యోగ భవనంలో జిల్లా సమితి సమావేశం నిర్వహించారు. మరోసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని లక్ష్యంతో భాజపా పార్లమెంటు సమావేశాల్లో మహిళా బిల్లును ప్రవేశపెట్టి, మహిళల ఓట్లకు గాలం వేస్తోందని విమర్శించారు. మహిళలపై దాడులు పెరిగిపోయాయని, దానికి ఉదాహరణ మణిపూర్‌ ఘటనలేనన్నారు. రాష్ట్రంలో అరాచకాలు, అక్రమ అరెస్టులు పెరిగిపోయాయని... ఈ ప్రభుత్వాలను సాగనంపాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాలేపల్లి వెంకటరమణ, మండల కార్యదర్శి పేట్ల పోతురాజు, ఎర్రబొమ్మల ఎంపీటీసీ సత్తిబాబు, లక్ష్మి, భీములమ్మ, విష్ణుమూర్తి, రెహమాన్‌, గంజారి రమణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని