logo

బాలికపై అసభ్య ప్రవర్తన కేసులో ఐదేళ్ల జైలు

బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన కేసులో నేరం రుజువు కావడంతో నిందితునికి ఐదేళ్ల జైలు శిక్షతోపాటు, రూ.5వేల జరిమానా విధిస్తూ పోక్సో న్యాయస్థానం ప్రత్యేక న్యాయమూర్తి జి.ఆనందిని తీర్పునిచ్చారు.

Published : 21 Sep 2023 02:44 IST

విశాఖ లీగల్‌, న్యూస్‌టుడే: బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన కేసులో నేరం రుజువు కావడంతో నిందితునికి ఐదేళ్ల జైలు శిక్షతోపాటు, రూ.5వేల జరిమానా విధిస్తూ పోక్సో న్యాయస్థానం ప్రత్యేక న్యాయమూర్తి జి.ఆనందిని తీర్పునిచ్చారు. పోక్సో న్యాయస్థానం ప్రత్యేక పబ్లిక్‌ ప్రాపిక్యూటర్‌ కరణం కృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. విజయనగరానికి చెందిన గుజ్జుల సూరయ్య గాజువాక ప్రాంతం, వెంకÛటేశ్వరకాలనీలో వాచ్‌మెన్‌గా విధులు నిర్వహించేవాడు. అదే ప్రాంతానికి చెందిన బాలిక(10) నాలుగో తరగతి చదివేది. 2022 ఏప్రిల్‌ 28వ తేదీ ఉదయం 8 గంటలకు తన ఇంటి సమీపంలో ఉన్న చెట్టు వద్దకు పూలు కోసుకోవడానికి వచ్చింది. ఆ ప్రాంతం నిర్మానుష్యంగా ఉండటంతో సూరయ్య బాలికను రోడ్డు పక్కకు తీసుకుపోయి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ తర్వాత వదిలేశాడు.  సాయంత్రం ఇంటికొచ్చిన తల్లికి బాధితురాలు ఈ విషయాన్ని తెలియజేసింది. ఆమె చెప్పిన ఆధారాలతో సూరయ్యను నిందితుడిగా గుర్తించారు. బాధితురాలి తల్లి గాజువాక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి సూరయ్యను న్యాయస్థానంలో హాజరు పరిచారు. సాక్ష్యాధారాలు పరిశీలించి న్యాయమూర్తి నిందితునికి పైవిధంగా శిక్ష విధించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని