logo

‘భూవివాదంలో ఎమ్మెల్యే తీరు సరికాదు’

రోలుగుంట మండలంలో జరిగిన వివాదంలో కొయ్యూరు జడ్పీటీసీ సభ్యుడు వారా నూకరాజుకు అండగా ఉంటామని ఎమ్మెల్యే చెప్పడంలో అర్థమేంటని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిని ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్‌ ఛైర్మన్‌ మొట్టడం రాజుబాబు, రాష్ట్ర కార్యదర్శి సొనియ గంగరాజు, జిల్లా కన్వీనర్‌ రామారావుదొర ఓ ప్రకటనలో ప్రశ్నించారు.

Updated : 22 Sep 2023 03:45 IST

నూకరాజుతో మాట్లాడుతున్న ఏఎంసీ ఛైర్‌పర్సన్‌ రాజులమ్మ

కొయ్యూరు, న్యూస్‌టుడే: రోలుగుంట మండలంలో జరిగిన వివాదంలో కొయ్యూరు జడ్పీటీసీ సభ్యుడు వారా నూకరాజుకు అండగా ఉంటామని ఎమ్మెల్యే చెప్పడంలో అర్థమేంటని ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిని ఆదివాసీ జేఏసీ రాష్ట్ర వైస్‌ ఛైర్మన్‌ మొట్టడం రాజుబాబు, రాష్ట్ర కార్యదర్శి సొనియ గంగరాజు, జిల్లా కన్వీనర్‌ రామారావుదొర ఓ ప్రకటనలో ప్రశ్నించారు. గత కొన్నేళ్లుగా అక్కడి ఆదివాసీలు, జడ్పీటీసీ సభ్యుడు నూకరాజు మధ్య భూ వివాదం జరుగుతుంటే ఎమ్మెల్యే పట్టించుకోలేదని ఆరోపించారు. ఆదివాసీలు భూమికోసమే పోరాటం చేస్తున్నారన్నారు. జడ్పీటీసీ సభ్యుడిని ప్రొత్సహించకుండా ఉంటే మంచిదని ఎమ్మెల్యేకు సూచించారు.


పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: జడ్పీటీసీ సభ్యుడు నూకరాజు దందాలను ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి తెలుసుకొని స్పందించాలని ఆదివాసీ జేఏసీ జిల్లా కన్వీనర్‌ రామారావుదొర అన్నారు. తన అధికారాన్ని ఉపయోగించుకుని నూకరాజు ఛటర్జీపురం ఆదివాసులను అక్కడి నుంచి వెళ్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బాధితులకు అండగా ఉండాల్సిన ఎమ్మెల్యే పేద ఆదివాసులపై చర్యలకు డిమాండ్‌ చేయడం విడ్డూరంగా ఉందన్నారు.


జడ్పీటీసీ సభ్యుడికి పరామర్శ

కొయ్యూరు, న్యూస్‌టుడే: భూవివాదంలో గాయపడిన జడ్పీటీసీ సభ్యుడు నూకరాజును చింతపల్లి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌ రాజులమ్మ, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు ముసిలినాయుడు గురువారం పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాక్షించారు. ఏఎంసీ సభ్యుడు అచ్యుత్‌, సర్పంచులు రాజకుమారి, శ్రీనివాసరావు, వైకాపా నేతలు గంగాధర్‌, మహేష్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని