logo

ఉద్యోగులపై ప్రభుత్వం వేధింపులు

షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో శతశాతం ఉద్యోగాలు ఆదివాసీలతో భర్తీ చేసేలా కొత్త చట్టం తీసుకురావాల్సిన అవసరముందని ఆదివాసీ ఉద్యోగ, ఉపాధ్యాయుల సంయుక్త కార్యాచరణ కమిటీ డిమాండ్‌ చేసింది.

Published : 24 Sep 2023 01:45 IST

ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకుల దీక్ష

పాడేరు/పట్టణం, న్యూస్‌టుడే: షెడ్యూల్డ్‌ ప్రాంతాల్లో శతశాతం ఉద్యోగాలు ఆదివాసీలతో భర్తీ చేసేలా కొత్త చట్టం తీసుకురావాల్సిన అవసరముందని ఆదివాసీ ఉద్యోగ, ఉపాధ్యాయుల సంయుక్త కార్యాచరణ కమిటీ డిమాండ్‌ చేసింది.  ఐటీడీఏ కార్యాలయం ఎదుట ఆదివాసీ ఉద్యోగ, ఉపాధ్యాయుల ఐకాస ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు శనివారానికి రెండో రోజుకు చేరుకున్నాయి. మాజీ ఎమ్మెల్యే లకే రాజారావు శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులు, ఉపాధ్యాయులపై ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందన్నారు. ఆదివాసీ ఐకాస జిల్లా కన్వీనర్‌ రామారావుదొర, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు యోగి, రామకృష్ణ, ముక్కి రామకృష్ణ, గంగన్నపడాల్‌, కాంతారావు, పోతురాజు, ఈశ్వరరావు, వరలక్ష్మి, నందో, కర్రన్న, రాజు, సింహాచలం, శాంతకుమారి, గంగరాజు తదితరులు పాల్గొన్నారు.

అక్రమ ధ్రువపత్రాలపై ఫిర్యాదు

పాడేరు, న్యూస్‌టుడే: అక్రమంగా జారీ చేసిన ధ్రువపత్రాలను రద్దు చేయాలని స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ను కోరినట్లు ఆదివాసీ ఐకాస కన్వీనర్‌ రామారావుదొర తెలిపారు. ఎస్‌డీసీని తమ బృందం సభ్యులు కలిశారన్నారు. నకిలీ ధ్రువపత్రాలు జారీచేసిన రెవెన్యూ అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. ఆదివాసీ ఐకాస నాయకులు గంగన్నపడాల్‌, గంగరాజు, రామారావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని