logo

మరో వారంలో విధుల్లోకి ఎంపీడీవోలు

జిల్లాలో శిక్షణ పొందుతున్న 34 మంది శిక్షణ ఎంపీడీవోలు శనివారం కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ను కలెక్టరేట్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.

Published : 24 Sep 2023 01:45 IST

కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌తో శిక్షణ ఎంపీడీవోలు

పాడేరు, న్యూస్‌టుడే: జిల్లాలో శిక్షణ పొందుతున్న 34 మంది శిక్షణ ఎంపీడీవోలు శనివారం కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ను కలెక్టరేట్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్నెల్లపాటు వివిధ అంశాలపై శిక్షణ పొందామని చెప్పారు. మరో వారం రోజుల్లో ఈ కార్యక్రమం పూర్తవుతుందన్నారు. అనంతరం కేటాయించిన స్థానాల్లో విధుల్లో చేరనున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ కాలంలో తమకు ఎదురైన సవాళ్లు, అనుభవాలను కలెక్టర్‌తో పంచుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని