logo

ఓపీఎస్‌ సాధించేవరకూ పోరాటం

ఉద్యోగులు, ఉపాధ్యాయుల అభిప్రాయ సేకరణ లేకుండా జీపీఎస్‌(గ్యారంటీ పింఛను స్కీం)ను బలవంతంగా రుద్దడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీసీపీఎస్‌ఈఏ జిల్లా ప్రధాన కార్యదర్శి కుడుముల వెంకటరమణ అన్నారు.

Published : 24 Sep 2023 01:45 IST

చింతపల్లిలో రెవెన్యూ అధికారులకు వినతిపత్రంఅందజేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయులు 

చింతపల్లి గ్రామీణం, న్యూస్‌టుడే: ఉద్యోగులు, ఉపాధ్యాయుల అభిప్రాయ సేకరణ లేకుండా జీపీఎస్‌(గ్యారంటీ పింఛను స్కీం)ను బలవంతంగా రుద్దడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీసీపీఎస్‌ఈఏ జిల్లా ప్రధాన కార్యదర్శి కుడుముల వెంకటరమణ అన్నారు. శనివారం స్థానిక రెవెన్యూ కార్యాలయం వద్ద నిరసన తెలిపి రెవెన్యూ అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. సీపీఎస్‌కు బదులుగా గ్యారంటీ పింఛను విధానం అమలు చేయాలని మంత్రిమండలి తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. పాత పింఛను విధానం సాధించే వరకు పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఫ్యాప్టో నాయకులు గౌడు గంగరాజు, దేపూరి శశికుమార్‌, లోచలి చిట్టినాయుడు, మధుబాబు, మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

పాడేరు పట్టణం, న్యూస్‌టుడే: జీపీఎస్‌ అమలు చేయాలని రాష్ట్ర మంత్రిమండలి చేసిన తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో పాడేరులో శనివారం నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దారుకు వినతిపత్రం అందజేశారు. ఫ్యాప్టో జిల్లా అధ్యక్షులు జగన్‌మోహన్‌రావు, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, కార్యదర్శులు శేషగిరి, వరలక్ష్మి, ఏపీటీఎఫ్‌ పాడేరు అధ్యక్షుడు పోతురాజు, ఏపీసీపీఎస్‌ఈఏ జిల్లా అధ్యక్షుడు ఈశ్వరరావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు