logo

సీలేరు మొదటి యూనిట్‌ మరమ్మతులకు చర్యలు

సీలేరు జలవిద్యుత్తు కేంద్రాన్ని సీలేరు కాంప్లెక్స్‌ నూతన ముఖ్య ఇంజినీర్‌ జవహర్‌ పరిశీలించారు. సీఈగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆంధ్రా-ఒడిశా ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్‌ఖండ్‌ ప్రాజెక్ట్‌ను తనిఖీ చేసి శనివారం రాత్రి సీలేరు వచ్చిన ఆయన ఆదివారం ఉదయం ఇక్కడ పర్యటించారు.

Updated : 17 Jun 2024 02:16 IST

ప్రాజెక్టును సందర్శించిన సీఈ

అధికారులు, ఇంజినీర్లు, సిబ్బందితో సమీక్ష నిర్వహిస్తున్న సీఈ జవహర్‌

సీలేరు, న్యూస్‌టుడే: సీలేరు జలవిద్యుత్తు కేంద్రాన్ని సీలేరు కాంప్లెక్స్‌ నూతన ముఖ్య ఇంజినీర్‌ జవహర్‌ పరిశీలించారు. సీఈగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆంధ్రా-ఒడిశా ఉమ్మడి నిర్వహణలో ఉన్న మాచ్‌ఖండ్‌ ప్రాజెక్ట్‌ను తనిఖీ చేసి శనివారం రాత్రి సీలేరు వచ్చిన ఆయన ఆదివారం ఉదయం ఇక్కడ పర్యటించారు. ఈ సందర్బంగా మరమ్మతులకు గురైన మొదటి యూనిట్‌ను పరిశీలించి అక్కడి సిబ్బందితో మాట్లాడారు. మిగతా 2, 3, 4 యూనిట్ల పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. మొదటి యూనిట్‌ను ఎప్పటిలోగా వినియోగంలోకి తెస్తారన్నది ఒక షెడ్యూల్‌ రూపొందించి వాటికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సీఈ ఆదేశించారు. సాధ్యమైనంత తొందరలో వినియోగంలోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని గుత్తేదారు అభిరామ్‌ తెలిపారు. యూనిట్‌ మరమ్మతులను వెంటనే ప్రారంభించాలని ఇంజినీరింగ్‌ కంపెనీ ప్రతినిధులకు గుత్తేదారు సూచించారు. అనంతరం స్థానిక సమావేశ మందిరంలో అధికారులు, ఇంజినీర్లు, కార్మికులతో సీఈ సమావేశమయ్యారు. ఎస్‌ఈ (సివిల్‌) కె.కె.వి.ప్రశాంత్‌కుమార్, ఇన్‌ఛార్జి ఎస్‌ఈ (ఓఅండ్‌ఎం) బాలకృష్ణ, ఈఈలు ప్రభాకర్, రాజేంద్రప్రసాద్, డీఈఈలు, ఏఈఈలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని