Andhra News: వైఎస్‌ కుటుంబానికి బీసీలంటే కోపం: అచ్చెన్నాయుడు

బీసీలకు ఎన్నో పథకాలు తీసుకొచ్చింది తెదేపా ప్రభుత్వ హయాంలోనేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. బలహీనవర్గాలను సీఎం జగన్‌ ఉక్కుపాదంతో

Updated : 11 Apr 2022 16:03 IST

అమరావతి: బీసీలకు ఎన్నో పథకాలు తీసుకొచ్చింది తెదేపా ప్రభుత్వ హయాంలోనేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. బలహీనవర్గాలను సీఎం జగన్‌ ఉక్కుపాదంతో అణచివేస్తున్నారని ఆరోపించారు. తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన బీసీ నేతల సదస్సులో అచ్చెన్న మాట్లాడారు. బలహీనవర్గాల నిధులను దారిమళ్లించిన ఘనత వైకాపాదని ఆరోపించారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుటుంబానికి బలహీనవర్గాలంటే కోపమని విమర్శించారు. 

నాడు వైఎస్‌ పైసా నిధులు కూడా కేటాయించకుండా బీసీ ఫెడరేషన్లను పెట్టారని.. నేడు బీసీ కార్పొరేషన్ల నిధులు కూడా జగన్‌ లాక్కుని మోసగించారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. వైకాపా ప్రభుత్వ హయాంలో బీసీలకు జరిగిన అన్యాయంపై చర్చకు సిద్ధమా? అని అచ్చెన్నాయుడు సవాల్‌ విసిరారు. రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసి ముగ్గురికి పంచారని.. అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో బీసీలకు ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయగలరా? అని నిలదీశారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని