Andhra News: ప్రజలకు తెదేపా ఎంత చేసినా మార్పు రావడం లేదు: అచ్చెన్నాయుడు

ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక పాలన ఎక్కడుందో సీఎం జగన్‌ చెప్పాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

Updated : 14 Apr 2022 17:06 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సామాజిక పాలన ఎక్కడుందో సీఎం జగన్‌ చెప్పాలని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. నాలుగు మంత్రి పదవులిస్తే అది సామాజిక న్యాయమా? అని ప్రశ్నించారు. ప్రజల్లో చైతన్యం లేక గత ఎన్నికల్లో తెదేపాను ఓడించారని పేర్కొన్నారు. ప్రజలకు తెదేపా ఎంత చేసినా మార్పు రావడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రజలు చైతన్యవంతులు కాకుంటే ఇక బానిస బతుకులేనని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎస్సీలు మళ్లీ తలెత్తుకొని తిరగాలంటే మళ్లీ చంద్రబాబు సీఎం కావాలని అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు.

సొంత రాజ్యాంగం అమలు చేస్తోంది: యనమల

వైకాపా ప్రభుత్వం సొంత రాజ్యాంగం అమలు చేస్తోందని పార్టీ సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు విమర్శించారు. ఆర్థిక వనరులతో సొంత జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. ఇలాంటి వారు అధికారంలోకి రాకుండా జనంలో మార్పు రావాలని అభిప్రాయపడ్డారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు