logo

నకిలీ బంగారంపై రుణ కేసులో బ్యాంకు సిబ్బంది సస్పెన్షన్‌

పట్టణంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చెంచుపేట శాఖలో ఆరుగురు ఖాతాదారులు నకిలీ బంగారం తాకట్టు పెట్టి రూ.43,07,300 రుణం తీసుకున్నట్టు సిబ్బంది విచారణలో నిర్ధారణ అయిందని బ్యాంకు సీఈవో కృష్ణవేణి,

Published : 20 May 2022 04:19 IST

తెనాలి (కొత్తపేట), న్యూస్‌టుడే: పట్టణంలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చెంచుపేట శాఖలో ఆరుగురు ఖాతాదారులు నకిలీ బంగారం తాకట్టు పెట్టి రూ.43,07,300 రుణం తీసుకున్నట్టు సిబ్బంది విచారణలో నిర్ధారణ అయిందని బ్యాంకు సీఈవో కృష్ణవేణి, జీఎం శేషభానురావులు గురువారం తెలిపారు. ఈ ఖాతాదారుల నుంచి వడ్డీతో కలిపి రూ.43,99,300ను రికవరీ చేసినట్టు వారు పేర్కొన్నారు. ఈ ఖాతాదారులు నకిలీ పసిడిని కుదవ పెట్టి మొత్తం 30 లోన్లు తీసుకున్నట్టు గుర్తించామన్నారు. ఈ అక్రమాలకు బ్యాంకు మేనేజర్‌ నేతి వరలక్ష్మి, సహాయ మేనేజర్‌ తాడిబోయిన రమాంజనాదేవి, క్యాషియర్‌ కె.నాగజ్యోతిని కారకులుగా గుర్తించినట్టు వారు స్పష్టం చేశారు. ఈ ముగ్గురిని ఈనెల 17న సస్పెండ్‌ చేశామని తెలిపారు. అలాగే వారిపై శాఖాపరమైన దర్యాప్తు జరిపి, న్యాయపరమైన చర్యలు కూడా తీసుకోనున్నట్టు వారు పేర్కొన్నారు.

పోలీసులకు  ఫిర్యాదు..  
ఆ బ్యాంకు మేనేజర్‌ వరలక్ష్మి, బ్యాంకు తరుఫున బంగారాన్ని నిర్ధారించే జానీబాషాలు రూ.43,07,300 రుణం తీసుకొని మోసం చేశారంటూ మూడో పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు బ్యాంకు అధికారులు తెలిపారు. దీంతో పోలీసులు ఆ ఇరువురిపై కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని