logo

కోత లేకుండా కడుపునొప్పికి చికిత్స

పొట్టలో భరించరానంతటి తీవ్రమైన నొప్పితో వచ్చిన రోగికి అత్యాధునిక చికిత్స అందించి సాంత్వన చేకూర్చారు. ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం, దైవాలరావూరు గ్రామానికి చెందిన రాఘవులు తీవ్రమైన

Published : 22 May 2022 04:17 IST

గుంటూరు వైద్యం, న్యూస్‌టుడే: పొట్టలో భరించరానంతటి తీవ్రమైన నొప్పితో వచ్చిన రోగికి అత్యాధునిక చికిత్స అందించి సాంత్వన చేకూర్చారు. ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం, దైవాలరావూరు గ్రామానికి చెందిన రాఘవులు తీవ్రమైన కడుపు నొప్పితో ఈనెల 19న సర్వజనాసుపత్రి గ్యాస్ట్రో ఎంటరాలజీ విభాగానికి వచ్చాడు. ఆ విభాగం వైద్యులు జగన్‌మోహన్, నాగూర్‌బాషా రోగిని పరీక్షించి కడుపులో నీటి తిత్తి ఉన్నట్లు గుర్తించారు. అతిగా మద్యం తాగటం వల్ల క్లోమ గ్రంథి వాచిపోయి నీటితిత్తి(సిస్ట్‌) రావడం జరిగిందని వైద్యులు తెలుసుకున్నారు. ఎండోస్కోపిక్‌ అల్ట్రాసౌండ్‌ సాయంతో కోత, కుట్టు లేకుండా కడుపులోని సిస్ట్‌ను తొలగించారు. రోగికి పూర్తి స్వస్థత చేకూరినందున శనివారం ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జి చేశారు. రోగికి అత్యాధునిక చికిత్స అందించిన వైద్యుల బృందాన్ని సూపరింటెండెంట్‌ ప్రభావతి ప్రత్యేకంగా అభినందించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని