logo

రాబోయే ఒలింపిక్స్‌పై ప్రత్యేక దృష్టి

‘73 సంవత్సరాల తర్వాత థామస్‌ కప్‌ గెలవడం ఎంతో సంతోషంగా, గర్వంగా ఉంది. ఈ స్ఫూర్తితో రాబోయే కామన్వెల్త్‌, ఏషియన్‌ గేమ్స్‌లో ప్రతిభను కనబర్చేందుకు కృషి

Updated : 27 May 2022 05:56 IST

స్టార్‌ షట్లర్‌ కిదాంబి శ్రీకాంత్‌

క్రీడాకారులతో ఫొటోలు దిగి, ఆటోగ్రాఫ్‌లు ఇచ్చి ఉత్సాహపర్చిన కిదాంబి శ్రీకాంత్‌

గుంటూరు క్రీడలు, న్యూస్‌టుడే: ‘73 సంవత్సరాల తర్వాత థామస్‌ కప్‌ గెలవడం ఎంతో సంతోషంగా, గర్వంగా ఉంది. ఈ స్ఫూర్తితో రాబోయే కామన్వెల్త్‌, ఏషియన్‌ గేమ్స్‌లో ప్రతిభను కనబర్చేందుకు కృషి చేస్తాం. 2024లో జరిగే ఒలింపిక్స్‌పై ప్రత్యేక దృష్టి పెడతాం’.. అని బ్యాడ్మింటన్‌ స్టార్‌ కిదాంబి శ్రీకాంత్‌ స్పష్టం చేశారు. థామస్‌ కప్‌ విజయం తర్వాత తొలిసారి గుంటూరుకు వచ్చిన ఆయనకు ఇంటి వద్ద ఘన స్వాగతం లభించింది. రాష్ట్ర బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు పున్నయ్య చౌదరి, సంయుక్త కార్యదర్శి సంపత్‌కుమార్‌, జిల్లా అధ్యక్షుడు రాయపాటి రంగబాబు, కార్యదర్శి దామచర్ల శ్రీనివాసరావు, కోశాధికారి రమేష్‌కుమార్‌, సంయుక్త కార్యదర్శి సురేష్‌కుమార్‌ తదితరులు శ్రీకాంత్‌కు గురువారం అభినందనలు తెలియజేసి సత్కరించారు. ఎన్టీఆర్‌ స్టేడియం కోచ్‌ బాషాతో శిక్షణ శిబిరంలో చిన్నారులు శ్రీకాంత్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని