logo

Vallabhaneni Vamsi: పార్టీలో నాకేమీ సమస్య లేదు: వంశీ

వైకాపాలో తనకెలాంటి సమస్యలేదని, ఎవరికైనా సమస్య ఉంటే వారే చూసుకోవాలని, ఎవరు కలిసొచ్చినా, రాకున్నా తన పని తాను చేసుకుంటూ వెళతానని, ఎన్నికల్లో గెలుపు కోసం ప్రజల ఆశీర్వాదం

Updated : 21 May 2022 09:31 IST

హనుమాన్‌ జంక్షన్, న్యూస్‌టుడే: వైకాపాలో తనకెలాంటి సమస్యలేదని, ఎవరికైనా సమస్య ఉంటే వారే చూసుకోవాలని, ఎవరు కలిసొచ్చినా, రాకున్నా తన పని తాను చేసుకుంటూ వెళతానని, ఎన్నికల్లో గెలుపు కోసం ప్రజల ఆశీర్వాదం ఉంటే చాలని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేర్కొన్నారు. 16 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్న తాను ఒకసారి ఎంపీగా పోటీ చేసి ఓడిపోగా, రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందానని, గెలుపు కోసం ఏ నాయకుడి మీద ఆధారపడలేదన్నారు. శుక్రవారం ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా బొమ్ములూరులో పర్యటించిన ఆయన స్థానిక విలేకరలుతో మాట్లాడారు. వంశీతో కలిసి పనిచేయనని దుట్టా రామచంద్రరావు స్పష్టంగా చెబుతున్న నేపథ్యంలో మీ స్పందన ఏమిటన్న ప్రశ్నకు ఎమ్మెల్యే పై విధంగా స్పందించారు. ఎవరి మనోభావాల ప్రకారం వారు నడుచుకుంటారని, 2014, 2019 ఎన్నికల్లో తనను ఓడించేందుకు నాయకులంతా కలిసికట్టుగా ప్రయత్నించినా ఏమీ చేయలేకపోయారన్నారు. సీఎం జగన్‌ అమలు చేస్తున్న పథకాలకు ఆకర్షితుడినై ఆయనకు మద్దతు పలికానని, ఆయన నాయకత్వంలోనే పనిచేస్తానని స్పష్టం చేశారు. 2024 ఎన్నికల్లో వైకాపా తరఫునే పోటీ చేస్తారా అన్న ప్రశ్నకు ఎమ్మెల్యే స్పందిస్తూ తొందరెందుకు చూస్తారుగా అన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని